ETV Bharat / sitara

ప్రభాస్​కు సర్జరీ.. త్వరగా కోలుకోవాలని అభిమానుల ఆకాంక్ష - ప్రభాస్​ స్పెయిన్​

Prabhas Surgery: బాహుబలి స్టార్​ ప్రభాస్​కు శస్త్రచికిత్స జరిగింది. స్పెయిన్​లోని బార్సిలోనాలో ఆయన సర్జరీ చేయించుకున్నారు. ఇటీవల జరిగిన 'సలార్' సినిమా షూటింగ్​లో గాయపడ్డారు ప్రభాస్.

ప్రభాస్​
ప్రభాస్​
author img

By

Published : Mar 18, 2022, 3:37 PM IST

Updated : Mar 18, 2022, 7:09 PM IST

Prabhas Surgery: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్.. 'రాధేశ్యామ్' రిలీజ్​ తర్వాత మీడియా ముందుకు రాలేదు. అయితే సినిమాపై మిశ్రమ స్పందన రావడం వల్ల ఆయన బయటకు వచ్చేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. అయితే తాజాగా ప్రభాస్ స్పెయిన్​కు వెళ్లారు. ప్రభాస్ స్వల్ప శస్త్రచికిత్స​ చేయించుకున్నారు. ఇటీవల సలార్​ షూటింగ్​లో గాయపడ్డ ప్రభాస్​.. ఈ మేరకు సర్జరీ చేయించుకున్నారు. చిన్నపాటి ఆపరేషనే​ అయినా డాక్టర్లు.. ప్రభాస్​ను పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పినట్లు సమాచారం. ఇక, ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

ఆర్​ఆర్​ఆర్​ ప్రీమియర్​ షోకి ప్రభాస్​..!

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌లో భాగంగా జక్కన్న ఇంట్లో గురువారం ఎన్​టీఆర్​, చరణ్​లు ముచ్చటించారు. సరదాగా సాగిన ఆ ఇంటర్వ్యూలో ప్రీమియర్​ షోకి డార్లింగ్​ ప్రభాస్​ వస్తారా? అని రాజమౌళిని ఎన్టీఆర్​ను​ అడిగారు. సమాధానంగా "ప్రభాస్​ కదిలి ప్రీమియర్​కు రావడం.. అది జరిగే పని కాదు" అని రాజమౌళి అన్నారు. జక్కన్న అన్న ఆ మాట.. ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. సర్జరీ జరిగినందుకే ప్రభాస్​ రాడని రాజమౌళి అన్నారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Prabhas Upcoming Movies: ఇటీవలే ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్' చిత్రం విడుదలైంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ మిక్స్​డ్​ టాక్​ను దక్కించుకుంది. ఆ తర్వాత ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్​-కే, స్పిరిట్‌ చిత్రాలు వరుసలో ఉన్నాయి. వీటితో పాటు డైరెక్టర్‌ మారుతీ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రంలో ప్రభాస్​ నటించనున్నారు.

ఇదీ చదవండి: ఆర్​ఆర్​ఆర్​ ప్రీమియర్​ షోకి ప్రభాస్​.!

Last Updated : Mar 18, 2022, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.