బాలీవుడ్ నిర్మాత మధు మంతేనా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న చిత్రం 'మహాభారతం'. ఇందులో కథానాయిక దీపికా పదుకొణె ద్రౌపది పాత్ర పోషించనుంది. ఇటీవలే సినిమా ప్రకటన సమయంలో.. ఈ పాత్ర పోషించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు దీపికా తెలిపింది. మరోవైపు శ్రీకృష్ణుడిగా నటించేందుకు హృతిక్ రోషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
తాజాగా ఈ సినిమాలో దుర్యోధనుడి పాత్ర కోసం రెబల్ స్టార్ ప్రభాస్‌ను సంప్రదించగా.. ఈ ఆఫర్‌ను తిరస్కరించాడట. చిత్ర బెనర్జీ దివాకరుణి రచించిన 'ది ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్స్' పుస్తకం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి.. దీపకా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
'మహభారతం' చిత్రాన్ని భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగాన్ని 2021 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్రబృందం. లాక్డౌన్ సడలింపులతో క్రమక్రమంగా వినోద పరిశ్రమలు పునఃప్రారంభం అవుతున్నప్పటికీ.. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతే సినిమాను తెరపైకి తీసుకురావాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇదీ చూడండి:'మహాభారతం' కోసం 'బాహుబలి' రచయితతో ఆమిర్