ETV Bharat / sitara

ప్రభాస్​ సరసన 'పెళ్లిసందడి' బ్యూటీ.. వెబ్​సిరీస్​లో రామ్​చరణ్​! - వెబ్​సిరీస్​లో రామ్​చరణ్​్

Cinema updates: 'పెళ్లిసందడి' హీరోయిన్​ శ్రీలీల ప్రభాస్​తో కలిసి నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా, మెగాహీరో రామ్​చరణ్​ త్వరలోనే ఓ వెబ్​సిరీస్​లో నటించనున్నట్లు సినీవర్గాలు సమాచారం.

Prabhas Sreeleela movie Ramcharan webseries
ప్రభాస్​ శ్రీలీల
author img

By

Published : Feb 15, 2022, 8:10 PM IST

Prabhas Sreeleela: 'పెళ్లి సందD' బ్యూటీ శ్రీలలకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఆమెకు ఆమె మరో బంఫర్​ ఆఫర్​ వరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్​ హీరోగా మారుతి దర్శకత్వంలో 'రాజా డీలక్స్'​ అనే సినిమా తెరకెక్కనుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మూవీలో శ్రీలీలను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. మొత్తంగా ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారట. అందులో ఒకరు శ్రీలీల అని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం శ్రీలల.. రవితేజ 'ధమాకా' సినిమాలో నటిస్తోంది.

Ramcharan in webseries: వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న మెగాహీరో రామ్​చరణ్​ ఇప్పుడు మరో కొత్త వేదికపై సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించే వెబ్‌సిరీస్‌లో చరణ్‌ నటించనున్నట్లు సినీవర్గాల సమాచారం. అమెరికాకు చెందిన ఓ పాపులర్‌ వెబ్‌సిరీస్‌ను చెర్రీ కోసం రీమేక్‌ చేస్తున్నారట. భారతీయ నేటివిటీకి తగ్గట్టుగా ఆ సిరీస్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై చరణ్‌తో చర్చలు జరిపారని, అందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. బాలీవుడ్‌ డైరెక్టర్‌ను ఈ సిరీస్‌ కోసం తీసుకోబోతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. త్వరలోనే రామ్​చరణ్​ నటించిన 'ఆర్​ఆర్అర్'​ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: ఆమిర్​ కోసం 'ఆదిపురుష్'​ పోస్ట్​పోన్​​.. 'జెర్సీ' కొత్త రిలీజ్​ డేట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.