ETV Bharat / sitara

ప్రభాస్​ 'ప్రాజెక్టు K' షూటింగ్ ఫొటోలు.. 'విరాటపర్వం' కొత్త అప్డేట్ - the amrican dream teaser

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ప్రాజెక్టు K, విరాటపర్వం, ద అమెరికన్ డ్రీమ్, మరక్కర్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

Prabhas project K rana virata parvam
ప్రభాస్ రానా మూవీ అప్డేట్స్
author img

By

Published : Dec 13, 2021, 8:29 PM IST

prabhas project K movie: డార్లింగ్ ప్రభాస్​ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్​లో 'ప్రాజెక్టు K' షూటింగ్​ చేస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె కూడా పాల్గొన్నారు. ఆమెకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయింది. అయితే షూటింగ్​ స్పాట్​లోని కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

Prabhas project K shooting photos
ప్రభాస్ K మూవీ షూటింగ్ ఫొటోస్
Prabhas project K shooting photos
ప్రభాస్ ప్రాజెక్టు కే మూవీ షూటింగ్ ఫొటోస్

అందులో భాగంగా నటీనటుల చేతులు, కాళ్లకు నల్లటి మసి ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథతో తీస్తున్న ఈ సినిమాలో అమితాబ్​ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. 2023లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

Virata parvam song: 'విరాటపర్వం' సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. 'ద వాయిస్ ఆఫ్ రావణ' సాంగ్​ను మంగళవారం ఉదయం 10:10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

virata parvam song
విరాటపర్వం మూవీ

ఈ చిత్రంలో రానా.. కామ్రేడ్ రవన్నగా నటించారు. నక్సలైట్​ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సాయిపల్లవి ప్రధాన పాత్ర చేసింది. ప్రియమణి, నందితాదాస్, నివేదా పేతురాజ్​ కీలకపాత్రలు పోషించారు. వేణు ఊడుగల దర్శకత్వం వహించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. కరోనా వేవ్​ల ప్రభావం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

Marakkar ott release date: మోహన్​లాల్​ ప్రధాన పాత్రలో భారీ వ్యయంతో తెరకెక్కించిన 'మరక్కర్' సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్​లో డిసెంబరు 17 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

marakkar OTT
మరక్కర్ మూవీ ఓటీటీ

మూడు జాతీయ అవార్డులతో పాటు కేరళ రాష్ట్ర అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం.. డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్టార్స్ చాలామంది ఉన్నప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులను అంతలా ఆకట్టుకోలేకపోయింది.

*'ఆహా' ఓటీటీ ఒరిజినల్​ 'ద అమెరికన్ డ్రీమ్' టీజర్ రిలీజైంది. ప్రిన్స్ ప్రధాన పాత్రలో నటించాడు. అమెరికా వెళ్లిన ఓ యువకుడు ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు? లాంటి విషయాల్ని ఇందులో చూపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓవైపు హాస్యభరితంగా సాగుతూనే, ఆసక్తిని రేపుతోంది. అభినయ్ సంగీతమందించగా, డాక్టర్.విఘ్నేశ్ కౌశిక్ దర్శకత్వం వహించారు. క్రిస్​మస్ నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.

spider man movie
స్పైడర్ మ్యాన్ మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.