ETV Bharat / sitara

ప్రభాస్-నాగ్ అశ్విన్​ సినిమా సెట్స్​పైకి వెళ్లేది అప్పుడే - ప్రభాస్-నాగ్ అశ్విన్​ సినిమా సెట్స్​పైకి వెళ్లేది అప్పుడే

ప్రభాస్​తో తీయబోయే సినిమా షూటింగ్​ను జులైలో ప్రారంభిస్తానని చెప్పారు దర్శకుడు నాగ్​ అశ్విన్​. అయితే ఈ చిత్రీకరణ ఎప్పటికీ పూర్తవుతుందో స్పష్టంగా చెప్పలేనని అన్నారు. నవీన్​ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన 'జాతిరత్నాలు' సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను వెల్లడించారు.

nag
నాగ్​
author img

By

Published : Mar 6, 2021, 4:11 PM IST

Updated : Mar 6, 2021, 5:17 PM IST

'ఎవడే సుబ్రమణ్యం'తో అందరి దృష్టిని ఆకర్షించి, ‘మహానటి’తో తెలుగు సినిమాను జాతీయస్థాయిలో నిలిపిన డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌. ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రం 'జాతి రత్నాలు'. పూర్తిస్థాయి కామెడీ చిత్రంగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలను జాతి రత్నాలుగా మార్చిన డైరెక్టర్‌ అనుదీప్‌తో ఆయన జర్నీ ఎలా సాగింది? ప్రభాస్‌తో చేస్తున్న సినిమా ఎంతవరకూ వచ్చింది, డైరెక్టర్‌ అనుదీప్‌లోని అమాయకత్వం ఎలా ఉంటుంది? ఇలాంటి విశేషాలన్నీ ఆయన పంచుకున్నారు. మరి ఆలస్యమెందుకు చదివేయండి!

నాగ్​ అశ్విన్​

అనుదీప్‌ను నేనే వెతుక్కుంటూ వెళ్లా..

నాకు జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటి క్లీన్‌ కామెడీ కథలను సినిమాగా తీయాలని ఉండేది. ఆ క్రమంలోనే అయిదారేళ్ల క్రితం అనుదీప్‌ తీసిన ఒక షార్ట్‌ఫిల్మ్‌ చూశా. కడుపుబ్బా నవ్వుకునే అమాయకత్వంతో కూడిన హాస్యం ఉంది. దాంతో అతన్ని వెతికి పట్టుకుని సినిమా తీయాలనుకున్నా. ఆయన రెండు మూడు ఐడియాలు చెప్పారు. చివరిగా ‘జాతిరత్నాలు’ ఫైనల్‌ చేశాం. ఇలాంటి హ్యుమర్‌ ఉన్న సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయి. అనుదీప్‌కు కొన్ని సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చాను.

నవీన్‌ ఎప్పుడూ నా మైండ్‌లో ఉంటాడు..
‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’కి పని చేస్తున్నప్పటి నుంచి నాకు విజయ్‌ దేవరకొండ, నవీన్‌ పొలిశెట్టి తెలుసు. అసలు ముందు ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రాన్ని చిన్న బడ్జెట్‌లో వీరిద్దరినీ పెట్టి తెరకెక్కిద్దామనుకున్నాం. కానీ కుదరలేదు. రెండేళ్ల ముందు నుంచే ‘జాతి రత్నాలు’ కథతో ట్రావెల్‌ అయ్యాం. ఈ టైంలోనే నవీన్‌కు ‘ఏజెంట్ సాయి..’ చిత్రంతో మంచి బ్రేక్‌ వచ్చింది. ముందు నుంచి ఈ కథకు నవీన్‌ నా మైండ్‌లో ఉన్నాడు. అతనికి తోడు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ తోడయ్యాక హాస్యానికి కొదవేముంటుంది. అందుకే ఈ ముగ్గురూ మా జాతిరత్నాలయ్యారు. ముగ్గురు సిల్లీ ఫెలోస్‌ ఒక సీరియస్‌ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనేది ఎంతో హాస్యంగా చూపిస్తాం.

prabhas
జాతిరత్నాలు

అప్పట్లో ‘మనీ’ ‘అనగనగా ఒక రోజు’..ఇప్పుడు ‘జాతి రత్నాలు’

ఒకలాంటి అమాయకత్వంతో కూడిన కామెడీ ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పట్లో వచ్చిన ‘మనీ’ ‘అనగనగా ఒకరోజు’ లాంటి కామెడీ మా చిత్రంలోనూ కనిపిస్తుంది. ఈ సినిమాకు అనుదీప్‌ మొదట ‘ఆణిముత్యాలు’ ‘సుద్దపూసలు’ అనే టైటిల్స్‌ సూచించాడు. చివరకు ‘జాతి రత్నాలు’అనుకున్నాం.

నిర్మాతలాగే వ్యవహరించా..

ఒక డైరెక్టర్‌ నిర్మాతగా మారినప్పుడు కొన్ని లెక్కలు ఉంటాయి. ముఖ్యంగా షాట్స్‌ పెట్టేటప్పుడు మన విజన్‌ను కూడా డైరెక్టర్‌తో చర్చిస్తాం. అయితే ఈ సినిమా విషయంలో అనుదీప్‌ స్టైల్లో టేకింగ్‌ ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడా పెద్దగా జోక్యం చేసుకోలేదు. సెట్‌కి వెళ్లినప్పుడు చిన్న చిన్న సలహాలు, సూచనలు ఇచ్చేవాడినంతే. ఈ సినిమా ద్వారా చాలామంది కొత్తవాళ్లను పరిచయం చేశాం. హీరోయిన్‌ ఫరీదాకు మంచి కామెడీ టైమింగ్‌ ఉంది. ఆమె అనుకోకుండా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యింది.

prabhas
నాగ్​ అశ్విన్​

కచ్చితంగా సందేశాత్మకంగానే ఉంటుంది..
ఇన్ని వందల మంది, ఇంత కష్టంతో సినిమా చేస్తున్నప్పుడు సినిమా అంటే ఏదో కాలక్షేపానికి తీసేది కాదు. కచ్చితంగా కామెడీతో పాటు సమాజానికి అవసరమయ్యే విషయాలను కూడా కథలో చెప్తాం. మొదట అనుదీప్‌ పూర్తి కామెడీగా తీద్దామన్నారు. నేను కొన్ని సలహాలు ఇచ్చి కథలో కొంచెం కొత్తదన్నాన్ని తీసుకొచ్చాం.

అనుదీప్‌కు మంచి మనసుంది..
ఒక సినిమా స్క్రిప్ట్‌ రాయాలంటే చాలా మేథస్సు అవసరం. కామెడీ కథలు రాయాలంటే ముఖ్యంగా అమాయకత్వం ఉండాలి. అనుదీప్‌లో ఆ అమాయకత్వంతో కూడిని సరదా విషయాలు చాలా ఉంటాయి. మంచి హృదయమున్నవాడు. పైకి సీరియస్‌గా కనిపించినా జోక్స్‌ బాగా వేస్తాడు. ‘క్యాష్‌’ ప్రోగ్రాం చూశాక మీకే అర్థమై ఉంటుంది. మామూలుగా ఒక జోక్‌ని ఒక్కసారి మించి వాడితే బోర్‌ కొడుతుంది. అలాంటిది ఈ సినిమాను ఒక ప్రేక్షకుడిలా లెక్కలేనన్ని సార్లు చూశా, అన్నిసార్లూ ఒకేలా నవ్వుకున్నా.

ప్రస్తుతానికైతే తెలుగు వరకే..
‘జాతి రత్నాలు’ ప్రస్తుతం తెలుగులో మాత్రమే విడుదల చేస్తున్నాం. నవీన్‌ బాలీవుడ్‌కి కూడా పరిచయస్థుడే. అయితే హిందీలో డబ్‌ చేయడానికి కొంత టైమ్‌ పడుతుంది. ఇంకా రిలీజ్‌కు సంబంధించిన పనులున్నాయి. లాక్‌డౌన్‌ కంటే ముందే ప్రభాస్‌తో ప్రాజెక్టు ఓకే అయ్యింది. ఆయనతో చాలా సౌకర్యంగా ఉంటుంది. పెద్ద స్టార్‌నన్న గర్వం కొంచెం కూడా ఉండదు. బాక్సాఫీసు రికార్డుల గురించి అస్సలు పట్టించుకోడు. ఎంతవరకూ స్టోరీ బాగుండాలి, సినిమా బాగుండాలనే తాపత్రయంలో ఉంటారు. నాకు తెలిసి సోషల్‌ మీడియాకు ఆయన చాలా దూరంగా ఉంటారు.

prabhas
ప్రభాస్​తో జాతిరత్నాలు

యాక్షన్‌ చెప్పి చాలా రోజులైందని..

‘పిట్ట కథలు’వెబ్‌ సిరీస్‌లో ఒక భాగాన్ని తెరకెక్కించాను. డైరెక్టర్‌గా యాక్షన్‌ చెప్పి చాలా రోజులు కావడంతో బోరింగ్‌ అనిపించేది. అందుకే ఏదైనా ప్రాజెక్ట్‌ చేస్తే మంచిదని చెప్పి ఆ వెబ్‌ సీరిస్‌ చేశా. ప్రభాస్‌తో చేస్తున్న మూవీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. షూటింగ్‌కు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నాం. ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందనేది ఇప్పుడే చెప్పలేను. జులై నుంచి రెగ్యులర్‌ షెడ్యూల్‌ ఉంది.

ఇలా ప్రచారం చెయ్యాలని ముందే అనుకున్నాం..
ఇలాంటి సినిమాలకు ప్రచారంలో కొత్తదనం కనిపిస్తేనే బాగుంటుందని ముందు నుంచీ అనుకున్నాం. మా ప్రమోషన్‌ టీమ్‌తో కూర్చుని ఎలా చేయాలో ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఆ మేరకే ఈ విధమైన ప్రచారం చేస్తున్నాం. ప్రస్తుతం గ్రౌండ్‌ లెవెల్లో జరుగుతున్న వినూత్న ప్రచారానికి మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ ఒక్క సినిమాకేనేమో..
ఈ సినిమాకు పూర్తిగా నేనే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నా. వైజయంతీ మూవీస్‌, స్వప్న మూవీస్‌ నాకు పూర్తి సహకారం అందించారు. ఈ జోనర్‌లో సినిమా నిర్మించాలనే ఉద్దేశంతోనే నిర్మాతగా మారా. కొత్తవాళ్లకు, ప్రతిభావంతులకు ఎల్లప్పుడూ స్వప్న సినిమా తలుపులు తెరిచే ఉంటాయి.

మనమెందుకు వాళ్ల మార్కెట్‌లోకి వెళ్లకూడదు..

ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలు తెలుగు నుంచి ఎక్కువగా రావడం సంతోషంగా అనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో సైతం మన చిత్రాలు రాణిస్తున్నాయి. హాలీవుడ్‌లో నిర్మించే ‘స్పైడర్‌ మ్యాన్‌’ తరహా చిత్రాలు మన మార్కెట్‌లోకి వస్తున్నప్పుడు మనమెందుకు వాళ్ల మార్కెట్‌లోకి వెళ్లకూడదు? అని నాకు ఎప్పటినుంచో అనిపించేది. ‘బాహుబలి’తో అది నిజమైంది. కచ్చితంగా అలాంటి సినిమాలు మరిన్ని వస్తాయనే నమ్మకముంది.

ఇదీ చూడండి: 'ఆదిపురుష్​' వల్ల నా సినిమాకు లాభం: నాగ్​ అశ్విన్​

Last Updated : Mar 6, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.