తనదైన నటనతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు బాలీవుడ్ నటి భాగ్యశ్రీ. త్వరలోనే హీరో ప్రభాస్ నటిస్తోన్న రాధేశ్యామ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తనపై క్రష్ ఉన్నట్లు ప్రభాస్ చెప్పాడని వెల్లడించారు.
"రాధేశ్యామ్ ఓ మంచి కథ. మీరు ఆ సినిమా చూస్తే గానీ దాని అనుభూతి తెలియదు. చిత్రబృందం నన్ను చాలా బాగా చూసుకున్నారు. హైదరాబాద్ మిఠాయిలు బహుమతిగా ఇచ్చారు. ఇకపోతే చిత్రకరణ సమయంలో ఓ సారి ప్రభాస్ నా దగ్గరకు వచ్చి నాపై క్రష్ ఉందని చెప్పాడు."
-భాగ్య శ్రీ, బాలీవుడ్ సీనియర్ నటి.
రాధేశ్యామ్‌కు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తుండగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తోంది. వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.
ఇదీ చూడండి పూజ,రాశీ అందాలు.. రష్మిక కసరత్తులు