ETV Bharat / sitara

ప్రభాస్ మాట వినుంటే 'ఆదిపురుష్'​కు నష్టం తప్పేదా? - ఆదిపురుష్​ చిత్రబృందానికి ప్రభాస్ సలహా

'ఆదిపురుష్' చిత్రీకరణ ప్రారంభంలోనే దర్శకుడు ఓంరౌత్​కు ఓ సలహా ఇచ్చాడట ప్రభాస్. అది పాటించి ఉంటే ఇప్పుడు చిత్రబృందానికి బడ్జెట్​ విషయంలో పెద్ద తలనొప్పి తప్పేదని తెలుస్తోంది.

Adipurush
ఆదిపురుష్
author img

By

Published : May 11, 2021, 4:01 PM IST

యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా రామాయణ ఇతిహాస నేపథ్యంలో 'ఆదిపురుష్' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కోసం ముంబయిలో రెండు భారీ సెట్లు నిర్మించి షూటింగ్ కూడా జరిపారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్రలో షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో మల్లగుల్లాలు పడిన చిత్రబృందం.. మిగతా షూటింగ్ హైదరాబాద్​లో పూర్తి చేయాలని భావించింది. అయితే ప్రభాస్ చెప్పిన ఓ మాట వినుంటే చిత్రబృందానికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని తెలుస్తోంది.

అదేంటంటే.. ప్రభాస్​కు ముంబయిలో షూటింగ్ అస్సలు ఇష్టం లేదట. ఈ చిత్రీకరణను హైదరాబాద్​లో నిర్వహిస్తే బాగుంటుందని చిత్రీకరణ ప్రారంభంలోనే దర్శకుడు ఓంరౌత్​కు సలహా కూడా ఇచ్చాడట యంగ్ రెబల్​స్టార్. కానీ ఓంరౌత్ మాత్రం తాను నిర్ణయించిన ప్రకారం ముంబయిలోనే రెండు భారీ సెట్లలో షూటింగ్ పూర్తి చేయాలని భావించాడట. ఇక ఆ తర్వాత కరోనా రావడం.. అక్కడ చిత్రీకరణ నిలిచిపోయడం.. మళ్లీ చిత్రబృందం హైదరాబాద్​ వైపు చూడటం జరిగిపోయాయి. ఒకవేళ ప్రభాస్ చెప్పిన మాట వినుంటే.. భారీ బడ్జెట్​తో రెండుసార్లు సెట్లు నిర్మించే పని తప్పేది కదా? అని తలపట్టుకుంటోదట చిత్ర యూనిట్.

'ఆదిపురుష్' కోసం ముంబయి ఫిల్మ్​సిటీతో పాటు బయట రెండు భారీ సెట్లు నిర్మించారు. విజువల్ ఎఫెక్ట్స్​కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రం కోసం సెట్లకూ ఎక్కువ ఖర్చే అయిందట. తప్పని పరిస్థితుల్లో మరోసారి ఆ రెండు భారీ సెట్లను హైదరాబాద్​లో నిర్మించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ పనిలో నిమగ్నమైంది చిత్రబృందం. తాజాగా గురువారం నుంచి తెలంగాణలోనూ లాక్​డౌన్​ అమలులోకి రానున్న పరిస్థితిల్లో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.