'నేను ఎప్పుడూ చూడని ఈ కళ్లు నన్ను దేవుడిలా చూస్తున్నాయి.. నేను ఎవర్నీ?'... అనే మాట వినగానే బాక్సాఫీస్ ఎప్పుడూ చూడని ఓ బ్లాక్‌బస్టర్ కళ్లముందు కదలాడుతుంది. ప్రేక్షకులు ఎన్నడూ కనని విజువల్ వండర్ మదిలో మెదులుతుంది. భారత సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి ఘనంగా చాటిన 'బాహుబలి'.. గుర్తుకువస్తుంది. ఈ సినిమా విడుదలై నేటికి ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టు పెట్టాడు హీరో ప్రభాస్. 'బాహుబలి' టీమ్‌కు అభినందనలు తెలిపాడు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అద్భుతాన్ని సృష్టించిందని అన్నాడు.
'బాహుబలి'.. తెలుగు వారి ప్రతిభను, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో బాహుబలిగా ప్రభాస్ నటన యావత్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుంది. శివగామిగా రమ్యకృష్ణ అభినయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ముఖ్య భూమిక పోషించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. వీఎఫ్ఎక్స్, మాహిష్మతి రాజ్యం సెట్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి.
-
నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురుచూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్లు..
— BARaju's Team (@baraju_SuperHit) July 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
6 Years for Young Rebel Star #Prabhas Top Director @ssrajamouli's India's Biggest Blockbuster #BaahubaliTheBeginning (10/07/2015)https://t.co/PUzuzPoAAP#6YearsOfUnrivalledBaahubali pic.twitter.com/GRnJrcTVWq
">నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురుచూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్లు..
— BARaju's Team (@baraju_SuperHit) July 10, 2021
6 Years for Young Rebel Star #Prabhas Top Director @ssrajamouli's India's Biggest Blockbuster #BaahubaliTheBeginning (10/07/2015)https://t.co/PUzuzPoAAP#6YearsOfUnrivalledBaahubali pic.twitter.com/GRnJrcTVWqనిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురుచూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్లు..
— BARaju's Team (@baraju_SuperHit) July 10, 2021
6 Years for Young Rebel Star #Prabhas Top Director @ssrajamouli's India's Biggest Blockbuster #BaahubaliTheBeginning (10/07/2015)https://t.co/PUzuzPoAAP#6YearsOfUnrivalledBaahubali pic.twitter.com/GRnJrcTVWq
రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి: ది బిగినింగ్'.. 2015 జులై 10న విడుదలైంది. ఈ సినిమా ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. హిందీలో బాహుబలిని విడుదల చేసిన ధర్మా ప్రొడక్షన్స్ ప్రత్యేక వీడియోను పంచుకుంది. "సినిమా చరిత్రకు ఆభరణాల కిరీటం తొడిగిన చిత్రం, అద్భుత కానుక.. బాహుబలి" అని వ్యాఖ్యానించింది. ఆరేళ్ల బాహుబలి ప్రభంజనాన్ని వేడుక చేసుకుంటున్నట్లు తెలిపింది.
-
The crown jewel and a majestic gift to the history of cinema that lit the screens with its astounding visuals and ingenious storytelling. Celebrating #6YearsOfBaahubali! pic.twitter.com/K26XKC5MKk
— Dharma Productions (@DharmaMovies) July 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The crown jewel and a majestic gift to the history of cinema that lit the screens with its astounding visuals and ingenious storytelling. Celebrating #6YearsOfBaahubali! pic.twitter.com/K26XKC5MKk
— Dharma Productions (@DharmaMovies) July 10, 2021The crown jewel and a majestic gift to the history of cinema that lit the screens with its astounding visuals and ingenious storytelling. Celebrating #6YearsOfBaahubali! pic.twitter.com/K26XKC5MKk
— Dharma Productions (@DharmaMovies) July 10, 2021
ఇదీ చూడండి: 'బాహుబలి' కాంబోలో మరో భారీ బడ్జెట్ చిత్రం!