ETV Bharat / sitara

Prabhas Pooja Hegde: పూజాహెగ్డే-ప్రభాస్​కు మాటల్లేవా? - రాధే శ్యామ్ ప్రభాస్

హీరోయిన్ పూజాహెగ్డేతో ప్రభాస్​కు గొడవ జరిగిందా? ఇద్దరు మాట్లాడుకోవడం లేదా? గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. మరి ఇది నిజమేనా? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

Prabhas Pooja Hegde
ప్రభాస్ పూజా హెగ్డే
author img

By

Published : Sep 23, 2021, 9:06 AM IST

Updated : Sep 23, 2021, 9:33 AM IST

పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌, బుట్టబొమ్మ పూజాహెగ్డే (Prabhas Pooja Hegde) జంటగా నటిస్తున్న సినిమా 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా (Radhe Shyam Release) వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. అయితే పూజాహెగ్డే, గతంలో షూటింగ్​కు ఆలస్యంగా వచ్చేందని, దీంతో ప్రభాస్​, ఆమెతో మాట్లాడటం మానేశారని కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయమై సదరు నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

Prabhas Pooja Hegde
'రాధే శ్యామ్' పోస్టర్​

అవన్నీ అవాస్తవాలేనని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తేల్చి చెప్పింది. వాళ్లిద్దరూ (Prabhas Pooja Hegde) చక్కగా మాట్లాడుకుంటున్నారని.. ఒకరిపై మరొకరికి అభిమానం ఉందని స్పష్టం చేసింది. ఆఫ్‌స్క్రీన్‌లో వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని.. ఆ బంధమే ఆన్‌స్క్రీన్‌లోనూ కొనసాగిందని వివరించింది. పూజా చక్కని సమయపాలన పాటిస్తుందని.. చెప్పిన సమయానికి సెట్‌లో ఉంటుందని, ఆమె మంచి నటి అని టీమ్‌ వివరించింది. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో 'మైనే ప్యార్‌ కియా' ఫేమ్‌ భాగ్యశ్రీ కీలకపాత్ర పోషించారు.

ఇదీ చూడండి: Prabhas Project K: 'ఆ రోజు నుంచే రెగ్యులర్​ షూటింగ్​'

Last Updated : Sep 23, 2021, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.