పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కేవలం రోజుల వ్యవధిలోనే కొత్త లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. గత కొన్నినెలల నుంచి లాక్డౌన్ ప్రభావంతో సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ఇంటికి, పార్టీ కార్యకలాపాలకే పరిమితమైన ఈయన.. తన వేషధారణపై పెద్దగా దృష్టి సారించలేదు. కానీ నవంబరు 1 నుంచి 'వకీల్‌సాబ్'కు హాజరైన నేపథ్యంలో పూర్తి స్టైలిష్‌గా దర్శనమిచ్చారు. దీంతోపాటే హైదరాబాద్ మెట్రోలో గురువారం ఉదయం ప్రయాణించి ప్రజల్ని ఆశ్చర్యపరిచారు. అభిమాన నటుడు తమతో ప్రయాణిస్తున్నాడనే సరికి ఆయన్న చూసేందుకు వారు ఎగబడ్డారు.
మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించిన పవన్ వెంట ఆయన వ్యక్తిగత సిబ్బంది, నిర్మాత దిల్‌రాజు ఉన్నారు. మెట్రోలో తోటి ప్రయాణికుడైన ఓ రైతుతో మాట్లాడిన పవర్‌స్టార్.. పంటల ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇది తమ తొలి మెట్రో ప్రయాణమని ఒకరికి ఒకరు చెప్పుకున్న వీరిద్దరూ కాసేపు నవ్వుకున్నారు.
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9439144_pawn3.jpg)
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9439144_pawn1.jpg)
ఇవీ చదవండి: