ETV Bharat / sitara

అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్తకు రిమాండ్​ - శిల్పాశెట్టి

అశ్లీల చిత్రాల కేసులో భాగంగా బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను జులై 23 వరకు పోలీస్​ కస్టడీకి తరలించారు. ఈ కేసులో మరో నిందితుడైన ర్యాన్​ థ్రోప్​నూ అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. రాజ్​ కుంద్రా అరెస్టు నేపథ్యంలో 9 ఏళ్ల క్రితం ఆయన చేసిన ఓ ట్వీట్​ ఇప్పుడు వైరల్​గా మారింది.

Porn films case: Businessman Raj Kundra remanded in police custody till July 23
అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్తకు రిమాండ్​
author img

By

Published : Jul 20, 2021, 6:27 PM IST

అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్​ కుంద్రాను జులై 23 వరకు పోలీస్​ కస్టడీకి తరలించారు. అశ్లీల చిత్రాలను నిర్మించి, పలు యాప్​ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న ఆరోపణ నేపథ్యంలో సోమవారం రాత్రి రాజ్​ కుంద్రాను ముంబయి క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు అరెస్టు చేశారు. రాజ్​ కుంద్రాకు సంబంధించిన మొబైల్​ ఫోన్​తో పాటు బిజినెల్​ లావాదేవీలను పోలీసులు సీజ్​ చేసి.. విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మరో నిందుతుడైన ర్యాన్​ థ్రోప్​నూ సోమవారం అదుపులోకి తీసుకోగా.. అతడ్ని కూడా జులై 23 వరకు పోలీస్​ కస్టడీకి తరలించారు.

అశ్లీల చిత్రాలు.. వ్యభిచారం

అశ్లీల చిత్రాల కేసులో రాజ్​ కుంద్రా అరెస్టు అయిన నేపథ్యంలో ఆయన గతంలో చేసిన ఓ ట్వీట్​ ఇప్పుడు వైరల్​గా మారింది. 2012 మార్చి 29న రాజ్‌ కుంద్రా తన ట్విటర్‌ వేదికగా.. "పోర్న్‌ వర్సెస్​ వ్యభిచారం. కెమెరా ముందు శృంగారం చేసినందుకు డబ్బులు చెల్లించడాన్ని ఎందుకు చట్టబద్ధం చేయకూడదు.? వ్యభిచారానికి దీనికీ ఏమైనా వ్యత్యాసం ఉందా?" అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. అది అప్పట్లో కాస్త వివాదాస్పదమైంది.

Businessman Raj Kundra remanded in police custody till July 23
రాజ్​కుంద్రా గతంలో చేసిన ట్వీట్లు

ఈ ట్వీట్​ వైరల్​ కాగా.. ఇప్పుడు రాజ్‌కుంద్రాపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

రాజ్​కుంద్రా ట్విట్టర్​ ఖాతా

రాజ్‌ కుంద్రా 2009లో శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నారు. 2012లో వారికి వియాన్‌ జన్మించాడు. గతేడాది వారు సరోగసి ద్వారా సమిష అనే పాపకు జన్మనిచ్చారు. జేఎల్‌ స్ట్రీమ్‌ యాప్‌ యజమాని అయిన రాజ్‌ కుంద్రా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టీం రాజస్థాన్‌ రాయల్స్‌కు సహ యజమానిగా ఉన్నారు. 2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్‌ బెట్టింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో దిల్లీ పోలీసులు రాజ్‌ కుంద్రాను ప్రశ్నించారు.

ఇదీ చూడండి.. అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.