హీరోయిన్ పూజా హెగ్డే.. ఈ ఏడాది 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'హౌస్‌ఫుల్ 4' చిత్రాలతో హిట్లు అందుకుంది. ఆమె నటించిన 'అల వైకుంఠపురములో'.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ.. సినిమాల్లోని ముద్దు సన్నివేశాల గురించి చెప్పింది. అలాంటి సీన్ల తీసేటపుడు చాలా ఇబ్బందులు పడుతుంటామంది.
ప్రేక్షకులకు బాగుంటుంది కానీ
లిప్‌లాక్ సీన్లను వెండితెరపై చూసేందుకు బాగున్నా.. ఆ సన్నివేశాల్లో నటింటేందుకు ఎంత కష్టపడతామో చూసేవారికి తెలియదని చెప్పింది పూజా. ఈ సందర్భంగా 'మొహంజోదారో' సినిమాలో హృతిక్ రోషన్‌కు ముద్దుపెట్టిన సీన్‌ను గుర్తు చేసుకుంది.
"మొహంజోదారో'లో హృతిక్‌తో ముద్దు సీన్ ఉంటుందని షూట్‌కు ముందు దర్శకుడు అశుతోష్ గోవారికర్ వివరించాడు. అందుకు నేనూ సిద్ధమయ్యా. కానీ, నాకు వణుకు పుట్టింది. కారణం నేను అలాంటి సన్నివేశాలు అంతకు ముందు చేయలేదు. మా చుట్టూ చాలా మంది నిలబడి ఉన్నారు. ఆ సమయంలో చాలా కష్టం అనిపించింది. రొమాంటిక్ సన్నివేశాల్లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యం. ఈ విషయం పక్కనపెడితే... కెమెరా ట్రిక్స్ ఈ సీన్లలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటి వల్ల ఇలాంటి ఇబ్బందికర సంఘటనల నుంచి మేం తప్పించుకుంటుంటాం"
- పూజా హెగ్డే, నటి
పూజా... ప్రస్తుతం ప్రభాస్‌కు జోడీగా 'జాన్' సినిమాలో నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
ఇదీ చదవండి: అవకాశాలు అందుకుని.. ఆకట్టుకుని.. అలరించి