Pooja Hegde Prabhas: 'రాధేశ్యామ్' కోసం ప్రభాస్‌తో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు నటి పూజాహెగ్డే. ఆన్‌స్క్రీన్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరిందని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు పూజాహెగ్డే స్పెషల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కెరీర్, తదుపరి ప్రాజెక్ట్‌లపై స్పందించారు. ఇందులో భాగంగా ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని అన్నారు.
"ప్రభాస్ మంచి వ్యక్తి. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మరలా ఆయనతో కలిసి సినిమా చేయాలని ఉంది. ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే ఆయన్ని 'బాహుబలి -3' చేయమని.. అందులో నన్నే హీరోయిన్‌గా తీసుకోమని చెప్తా. ఈ సినిమా విడుదలయ్యాక నాకు ఎంతో మంది నుంచి ప్రశంసలు వచ్చాయి. ప్రేరణగా నా యాక్టింగ్ బాగుందని అందరూ చెప్పారు. ముఖ్యంగా విమర్శకులు సైతం నన్ను ప్రశంసిస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో కళ్లతోనే నేను పలికించిన భావాలు బాగున్నాయని చెబుతున్నారు. అందుకు నాకెంతో ఆనందంగా ఉంది" అని పూజా తెలిపారు.
ఇదీ చదవండి: రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తోన్న 'పెన్నీ' సాంగ్