ETV Bharat / sitara

మన రిలేషన్​పిప్​ గురించి ఆ రోజే చెప్తా: పూజాహెగ్డే - పూజాహెగ్డే ఎన్టీఆర్​

ప్రస్తుతం స్టార్​ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ కెరీర్​లో జోరు మీదున్నా హీరోయిన్ పూజాహెగ్డే.. తాజాగా అభిమానులతో ముచ్చటించింది. కథానాయకులు ప్రభాస్​, విజయ్​, ఎన్టీఆర్​, యశ్​పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపింది. అవన్నీ ఆమె మాటల్లోనే..

pooja
పూజాహెగ్డే
author img

By

Published : Oct 19, 2021, 12:21 PM IST

ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న కథానాయిక పూజాహెగ్డే. అటు అగ్ర కథానాయకులతోనూ, ఇటు యువ కథానాయకులతో ఆడి పాడుతోంది. అంతేకాదు, ఆమె నటించిన ఆరు చిత్రాలు వరుసగా హిట్‌ అయ్యాయి. ఇటీవల అఖిల్‌కు జోడీగా నటించిన 'మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌'లో(pooja hegde most eligible bachelor) ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 'మన రిలేషన్‌ గురించి పబ్లిక్‌కు ఎప్పుడు చెబుదాం' అన్న ప్రశ్నకు పూజా ఇచ్చిన సమాధానం నవ్వులు పూయిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాధేశ్యామ్‌ గురించి ఏదైనా చెప్పండి!(pooja hegde radhe shyam first look)

పూజా హెగ్డే: ఎపిక్‌ లవ్‌స్టోరీ. అద్భుతమైన విజువల్స్‌.

దళపతి విజయ్‌ గురించి ఒక్క మాట చెప్పండి!(pooja hegde vijay 65)

ఒక్క మాటలో చెప్పడం కుదరదు. కానీ, ప్రయత్నిస్తా.. స్వీటెస్ట్‌(విజయ్‌తో కలిసి ‘బీస్ట్‌’లో నటిస్తోంది)

మీ ఫ్యాన్స్‌ గురించి..!

నన్ను బాగా చూసుకుంటారు!

ఇంట్లో చేసిన ఆహారం తినడం ఇష్టమా? లేక బయట ఆహారం ఇష్టమా?

ఆహారంతో ప్రయోగాలు చేయటం ఇష్టం. కానీ, మా అమ్మ చేసినట్లు ఏదీ ఉండదు.

పెద్ద సినిమాలు.. పెద్ద హీరోలతో నటిస్తూ సమయాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?(pooja hegdey movies list)

(నవ్వుతూ) తక్కువ నిద్రపోతూ తరచూ విమానాలు ఎక్కుతున్నా. అందుకు సినిమానే కారణం. నిజం చెప్పాలంటే నాకు పనిచేయడమంటే ఇష్టం. చాలా ఆత్రుతగా ఉంటా. నిరంతరం పనిలో ఉండటం వల్ల ప్రయోజనం ఏంటంటే..తక్కువ మాట్లాడతాం.

ఆచార్యలో 'నీలాంబరి' పాట ఎలా ఉండబోతోంది?(poojahegdey acharya movie)

మీరంతా ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఎదురు చూస్తున్నా. విజువల్‌ పరంగా చాలా బాగుంటుంది. ఆ పాట చేసిన క్షణాలను మర్చిపోలేను.

'కె.జి.యఫ్‌' హీరో యశ్‌ గురించి ఒక్క మాటలో..!

కన్నడ ఇండస్ట్రీని గర్వించేలా చేశాడు.

ఒత్తిడిని ఎలా జయిస్తారు? అందుకు మీరు ఏం చేస్తారు? నాకు తెలుసుకోవాలని ఉంది.

సంగీతమే నా ఒత్తిడి తగ్గించే థెరపీ. అదే నా బెస్ట్‌ ఫ్రెండ్‌. నేను నిరాశలో ఉన్నప్పుడు ఎక్కువగా సంగీతం వినేదాన్ని. మనసులో ఏదీ పెట్టుకోకుండా ఏడవటం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఐదు నిమిషాల్లో ఇవన్నీ చేసి, మళ్లీ పనిలో నిమగ్నమవుతా.

మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీ ఫేవరెట్‌ సబ్జెక్ట్స్‌ ఏంటి?

ఇంగ్లీష్‌, ఫిజిక్స్‌

తొలినాళ్లలో మీకు సరైన గుర్తింపు రాలేదు. ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలు చేస్తున్నారు. మీ కెరీర్‌ ఎదుగుదలను ఎలా చూస్తున్నారు?

మొదట్లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. నాకు బాగా గుర్తు, కొన్ని రోజులు నాకు పనే దొరకలేదు. పనిపై మనసు పెట్టి కష్టపడితే అదే మనల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది.

మీ తండ్రి నుంచి మీరు నేర్చుకున్న మూడు విషయాలు?

  • కరోఠ శ్రమకు ప్రత్యామ్నాయం ఉండదు.
  • పని ప్రదేశంలో ఎదురైన సమస్యలను ఇంట్లోకి తీసుకురావొద్దు (ఒకప్పటితో పోలిస్తే ఈ విషయంలో మెరుగు పడ్డా)
  • నీలో ఉన్న చిన్నపిల్లవాడిని ఎప్పుడూ అణచివేయకు.

'ఆచార్య'లో చిరంజీవితో పనిచేయడం ఎలా అనిపించింది?(poojahegdey acharya movie)

ఇప్పుడే చెప్పలేను. కానీ, చిరంజీవిగారు 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌' చూసి, నన్ను అభినందిస్తూ సందేశం పంపారు. మరింత కష్టపడిన పనిచేయాలని ఆ సందేశం నాలో స్ఫూర్తినింపింది.

ఎవరితో కలిసి నటించటం మీ కల?

ఒకే ఒక్కరు అమితాబ్‌ బచ్చన్‌ సర్‌. ఏదో ఒక రోజు నా కల సాకారం అవుతుంది.

మెస్సీ లేదా? రొనాల్డో ఎవరంటే ఇష్టం?

మెస్సీ

జూ.ఎన్టీఆర్‌ గురించి ఒకే ఒక మాటలో...(poojahegdey NTR movie)

రియల్‌

మన బంధం గురించి ఎప్పుడు పబ్లిక్‌కు చెబుదాం?

రక్షాబంధన్‌ రోజున

మీరు బాగా కలతచెంది, తలుచుకుంటూ ఇప్పటికీ ఇబ్బందిగా అనిపించే సినిమా?

ఇన్‌ టు ది వైల్డ్‌

వరుసగా ఆరు హిట్‌లు కొట్టారు మీరెంత అదృష్టవంతురాలో..!

మీకొక ప్రశ్న.. ఏ దృష్టికోణంలో అలా అన్నారు? కఠోర శ్రమ, సరైన స్క్రిప్ట్‌లు ఎంచుకోవడం వల్ల కాదా? వాటితో పాటు, దేవుడి దయ కూడా..!

ఇదీ చూడండి: నాకు ఒక్క ప్రేమలేఖా రాలేదు: పూజాహెగ్డే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.