ETV Bharat / sitara

మణిరత్నం భారీ బడ్జెట్​ సినిమా విడుదల ఎప్పుడంటే.. - Ponniyin Selvan part 2

మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ వంటి స్టార్ నటులు నటిస్తోన్న చిత్రం పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం.

Ponniyin Selvan
పొన్నియన్ సెల్వన్
author img

By

Published : Jul 19, 2021, 6:26 PM IST

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌'(Ponniyin Selvan). 2019 డిసెంబర్‌లో థాయ్‌లాండ్​లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా చిత్రీకరణ‌ వాయిదా పడింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని.. మొదటి భాగాన్ని 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించింది.

Ponniyin Selvan
పొన్నియిన్ సెల్వన్

మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జయరామ్‌, శోభిత ధూళిపాళ్ల, శరత్‌ కుమార్, ప్రకాశ్​రాజ్‌, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇవీ చూడండి: సందీప్​ వంగా 'పవర్'​ఫుల్ మెమోరీస్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.