హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో డర్టీహరీ సినీ నిర్మాత శివ రామకృష్ణపై కేసు నమోదైంది. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో ఫిల్లర్లపై అంతికించిన సినీపోస్టర్లు అభ్యంతరకరంగా... స్త్రీలను అవమానించేలా ఉన్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
యువతను తప్పుదోవ పట్టించే రీతిలో డర్టీహరీ సినిమా పోస్టర్లు ఉన్నాయని పేర్కొంటూ నిర్మాతతో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీలపై కేసు నమోదు చేశారు. ఎస్పీజే క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి, రుహని శర్మ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: ఈ ఏడాది ట్విట్టర్లో ఈ దక్షిణాది స్టార్స్‌దే హవా