ETV Bharat / sitara

పవర్ స్టార్ వచ్చేశాడు.. అదిరిపోయిన 'వకీల్ సాబ్' ఫస్ట్​లుక్ - పవనకల్యాణ్​ 26వ చిత్రం ఫస్ట్​లుక్​ విడుదల

పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్​ నటిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్​లుక్​ విడుదలైంది. బాలీవుడ్​లో విజయవంతమైన 'పింక్​' సినిమాకు రీమేక్​ ఇది. 'వకీల్ సాబ్' అనే టైటిల్​తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

pawan
పింక్​ రీమేక్​ ఫస్ట్​లుక్​ విడుదల
author img

By

Published : Mar 2, 2020, 5:01 PM IST

Updated : Mar 3, 2020, 4:27 AM IST

పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్‌.. యువతలో విశేషమైన క్రేజ్‌ ఉన్న కథానాయకుడు. ఒక్క సన్నివేశంలో కనిపించినా.. గొంతు వినిపించినా థియేటర్లు ఈలలు, అరుపులతో దద్దరిల్లిపోతాయి. 'అజ్ఞాతవాసి' తర్వాత ఈ హీరో నుంచి మరో చిత్రం రాలేదు. దీంతో పవన్‌ ఎప్పుడెప్పుడు సినిమాల్లో నటిస్తాడా.. అతడి ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు సమాధానం దొరికేసింది. పవన్ హీరోగా నటిస్తోన్న 'పింక్' రీమేక్ టైటిల్​తో పాటు ఫస్ట్ లుక్ వచ్చేసింది.

ఈ చిత్రానికి 'వకీల్ సాబ్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ పోస్టర్​లో పవర్ స్టార్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది. గుబురు గడ్డంతో చేతిలో పుస్తకం పట్టుకుని ఉన్న స్టిల్ అభిమానులకు కనువిందు చేసేలా ఉంది.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

పవర్ స్టార్
'వకీల్ సాబ్' ఫస్ట్​లుక్

ఇదీ చూడండి : ట్రైలర్: 'ఉగ్రవాదుల తర్వాతి టార్గెట్​ ముంబయి'

Last Updated : Mar 3, 2020, 4:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.