ETV Bharat / sitara

'ఆర్‌ఆర్‌ఆర్‌'పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు.. కారణమిదే - RRR ntr

RRR movie: 'ఆర్​ఆర్​ఆర్​' సినిమాపై ఏపీ హైకోర్టులో పిటిషన్​ దాఖలు అయింది. చిత్రంలో అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరించిన కారణంగా న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు వీరభద్రరావు.

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Jan 18, 2022, 5:12 PM IST

RRR movie: దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'ఆర్​ఆర్​ఆర్​'. ప్రస్తుతం పరిస్థితులు బాగా ఉండి ఉంటే ఇప్పటికే బాక్సాఫీస్​ ముందు రికార్డులు సృష్టించేది. అయితే ఇప్పుడీ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. 'ఆర్‌ఆర్‌ఆర్​'లో అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరించిన కారణంగా ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు వీరభద్రరావు తెలిపారు. చిత్రంలో అభూత కల్పనలు వద్దని.. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తే సహించమన్నారు. బిట్రీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటిష్‌ పోలీసుగా చూపించడం దారుణమని... ఇదే విషయంపై సినిమా నిర్మాతలపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. అల్లూరి, కొమురం భీమ్‌ కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదని, అలాంటిది.. ఆ ఇద్దరినీ కలిపి సినిమాగా తీయడం సరికాదన్నారు. రాజమౌళి చరిత్రను మారుస్తున్నారని... అలా చిత్రీకరించి భావితరాలకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల పాటు చరిత్రను భ్రష్టుపట్టిస్తున్నారన్నారు.

‘ఆర్ఆర్‌ఆర్‌’ కేవలం కల్పిత కథ అని, స్వాతంత్య్ర పోరాటంలో ఆ ఇద్దరు మహావీరులు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో రూపొందిస్తున్నామని రాజమౌళి వివరణ ఇచ్చినప్పటికీ చరిత్రను వక్రీకరించకూడదన్నారు. ఇప్పటికైనా అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను సినిమా నుంచి వెంటనే తొలగించాలని వీరభద్రరావు డిమాండ్‌ చేశారు. కాగా కొన్ని రోజుల క్రితం అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అల్లూరి, కొమురంభీం జీవన విధానాలకు విరుద్ధంగా ఈ సినిమాను చిత్రీకరించడం చట్ట విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణ జరగాల్సి ఉంది.

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్', 'పుష్ప' ​స్పూఫ్​.. చూస్తే వావ్​​ అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.