ETV Bharat / entertainment

థియేటర్​లో 'వలిమై' సినిమా.. బయట బాంబు పేలుడు

author img

By

Published : Feb 24, 2022, 5:12 PM IST

Updated : Dec 23, 2022, 4:07 PM IST

Valimai bomb blast: అజిత్ 'వలిమై' షో రన్ అవుతున్న సమయంలో ఓ థియేటర్​ బయట బాంబు పేలడం కలకలం రేపింది. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.

Ajith valimai bomb
అజిత్ వలిమై

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Ajith valimai bomb: తమిళ అగ్రహీరో అజిత్ నటించిన 'వలిమై'.. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు(ఫిబ్రవరి 24) థియేటర్లలో రిలీజైంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్​ వద్ద బాంబు పేలడం కలకలం సృష్టించింది.

ఇంతకీ ఏం జరిగింది?

తమిళనాడులో కోయంబత్తూర్​లో దాదాపు 20 స్క్రీన్స్​లో 'వలిమై' రిలీజ్​ చేశారు. గురువారం ఉదయం 5 గంటల సమయంలో గంగా థియేటర్​లో బెన్​ఫిట్​ షో రన్ అవుతున్న సమయంలో బైక్​పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు.. థియేటర్​ బయట పెట్రోల్ బాంబు విసిరి పారిపోయినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని లేనప్పటికీ, ఓ బైక్ మాత్రం పాక్షికంగా దెబ్బతింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై వారు స్పందించాల్సి ఉంది.

యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన 'వలిమై' సినిమాలో అజిత్ హీరోగా నటించారు. తెలుగు నటుడు కార్తికేయ.. విలన్​గా చేశారు. హ్యుమా ఖురేషి కీలకపాత్ర పోషించారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. బోనీ కపూర్ నిర్మాత.

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.