ETV Bharat / sitara

'ఆర్ఆర్​ఆర్​' డిజిటల్​, శాటిలైట్​ హక్కులు వీరివే

'ఆర్​ఆర్​ఆర్​' సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్​​ హక్కులపై పెన్​ స్టూడియోస్​ ఓ అధికార ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా వివిధ భాషలతో సహా ఇతర దేశాలకు సంబంధించిన డిజిటల్​ భాగస్వాములు ఎవరనే దానిపై స్పష్టతనిచ్చింది.

Pen Studios Announces Digital And Satellite Rights Of RRR movie
'ఆర్ఆర్​ఆర్​' డిజిటల్​, శాటిలైట్​ హక్కులు వీరివే
author img

By

Published : May 26, 2021, 5:49 PM IST

Updated : May 26, 2021, 6:05 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్' సినిమా డిజిటల్, శాటిలైట్​​ హక్కులపై పెన్​ స్టూడియోస్​ ఓ అధికార ప్రకటన చేసింది. వీటిని సొంతం చేసుకున్న పలువురు భాగస్వాముల గురించి ఓ వీడియో ద్వారా వెల్లడించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిజిటల్​ స్ట్రీమింగ్​ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకోగా.. సినిమా హిందీ వర్షెన్​ను నెట్​ఫ్లిక్స్​ కొనుగోలు చేసింది.

మరోవైపు శాటిలైట్ విభాగంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా హక్కులను స్టార్​ నెట్​వర్క్​ సొంతం చేసుకోగా.. మలయాళంలో ఏసియంట్​, హిందీలో జీ నెట్​వర్క్​ హక్కుదారుగా ఉన్నాయి. ఇతర దేశాల భాషలైన ఇంగ్లీష్​, పోర్చుగీస్​, కొరియన్​, టర్కీష్​, స్పానిష్​లలో నెట్​ఫ్లిక్స్​ డిజిటల్​ వేదికలో ప్రసారం​ చేయనుంది. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ థియేట్రికల్​ హక్కులను పెన్​ మరూధర్​ సినీ ఎంటర్​టైన్మెంట్స్​(పెన్ స్టూడియోస్​) సొంతం చేసుకుంది.

రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

ఇదీ చూడండి.. ధ్యాన్​చంద్​ బయోపిక్​ నుంచి తప్పుకున్న బాలీవుడ్​ హీరో

Last Updated : May 26, 2021, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.