'వకీల్ సాబ్' టీజర్‌తో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అదరగొట్టేశారు! దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ ఓ సినిమా చేస్తుండటం వల్ల దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని ఈ టీజర్ ఇంకాస్త పెంచిందనే చెప్పాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బాలీవుడ్ హిట్ 'పింక్' రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. ఇందులో పవన్ న్యాయవాదిగా కనిపించనున్నారు. శ్రుతిహాసన్ ఆయన సరసన నటించింది. అంజలి, నివేదా థామన్, అనన్య ఇతర కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. వేసవి కానుకగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసే అవకాశముంది.
ఇవీ చదవండి: