పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. 'పింక్' రీమేక్‌లో నటించనున్నాడనేది అందరికి తెలిసిన విషయం. అయితే దీనికి తోడుగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటి సినిమాకు ఇంకా అధికారిక ధ్రువీకరణ రాకముందే రెండో చిత్రాన్ని ఒప్పుకున్నాడట పవన్. క్రిష్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.
తొలిసారి ఈ సంగీత దర్శకుడితో
పవర్‌స్టార్.. 'పింక్' రీమేక్ తర్వాత క్రిష్‌తో చారిత్రక నేపథ్యమున్న సినిమా చేయనున్నాడట. రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారని సమాచారం. ఇందులో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉందని... అందుకే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని సంప్రదించారట. ఇదే నిజమైతే పవన్‌తో కీరవాణి పనిచేసిన తొలి చిత్రమిదే అవుతుంది.
అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యేలోపే 'పింక్' రీమేక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది పవన్ ఆలోచన. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వేసవికే ప్రేక్షకులను పలకరించనుందీ చిత్రం.
ఇదీ చదవండి: రివ్యూ 2019: టాప్ హీరోల ఆధిపత్యం కొనసాగిందా?