పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమాల వేగం పెంచారు. 'వకీల్‌సాబ్' ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకోగా, ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో తీస్తున్న చిత్ర యూనిట్‌తో పవన్ కలిశారు. ఈ విషయాన్ని చిత్రబృందం స్వయంగా అభిమానులతో పంచుకుంది.
![pawan kalyan in #PSPK27 sets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10207368_cinema-4.jpg)
![pawan kalyan in #PSPK27 sets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10207368_cinema-3.jpg)
పీరియాడికల్ డ్రామాగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ ఆకట్టుకుంటోంది. ఎ.ఎం.రత్నం నిర్మాత. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్‌ను ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు.
మెగా హీరో వరుణ్‌తేజ్ 'ఎఫ్3' సెట్‌లో అడుగుపెట్టారు. ఇటీవల కరోనా బారినపడిన అతడు.. దాన్నుంచి కోలుకున్నాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'ఎఫ్3' చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆ ఫొటోను డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
![varun tej in F3 sets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10207368_cinema-2.jpg)
వెంకటేశ్, వరుణ్‌తేజ్ నటించిన 'ఎఫ్2'కు ఇది సీక్వెల్ ఇందులో తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ ఏడాదే సినిమా విడుదల కానుంది.
ఇది చదవండి: పవన్ నిర్మాతగా వరుణ్ తేజ్ చిత్రం!