ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్‌కల్యాణ్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోందని దర్శకుడు క్రిష్ అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన వకీల్‌సాబ్ ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడారు.
"ఫ్యాన్స్‌నందు పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ వేరయా! ఒకరోజు వీరమల్లు షూటింగ్ చేస్తుండగా లంచ్ టైమ్‌లో ట్విటర్ ఓపెన్ చేశా. వెంటనే పది మెస్సేజ్‌లు కనిపించాయి. 'ఇవాళ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది. మా పవన్‌కల్యాణ్‌గారిని జాగ్రత్తగా చూసుకోండి' అని ఆయన అభిమానులు సందేశాలు పంపారు. సాధారణంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో పవన్‌కల్యాణ్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. దానికి మొదటగా 'వకీల్‌సాబ్' దిగ్విజయంగా జయభేరి మోగించబోతోంది. ఈ సందర్భంగా దిల్‌రాజుగారికి ధన్యవాదాలు చెబుతున్నా" అని క్రిష్ అన్నారు.
ప్రస్తుతం ఏ అగ్ర హీరో చేయని విధంగా పవన్ వరుసగా మూడు సినిమాలు చేస్తున్నారని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. ఒక వైపు షూటింగ్స్‌లో పాల్గొంటూనే మరోవైపు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉంటున్నారని చెప్పారు. ఆయన సినిమాలు చేసేది ప్రజల కోసమేనని అన్నారు. 'పింక్' రీమేక్ అయినా ఈ చిత్రం పవన్‌కల్యాణ్ శైలిలో ఉంటుందని తెలిపారు.