చిత్రసీమలో ప్రతిష్టాత్మక పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను వరించడంపై టాలీవుడ్ అగ్రకథానాయకుడు పవన్‌కల్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ పురస్కారానికి అర్హులని ఆయన అన్నారు.
-
Heartfelt congratulations to Sri @rajinikanth
— JanaSena Party (@JanaSenaParty) April 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
శ్రీ @rajinikanth గారికి హృదయపూర్వక శుభాభినందనలు - janaSena chief Shri @PawanKalyan #DadasahebPhalkeAward #rajinikanth pic.twitter.com/3QTHowap16
">Heartfelt congratulations to Sri @rajinikanth
— JanaSena Party (@JanaSenaParty) April 1, 2021
శ్రీ @rajinikanth గారికి హృదయపూర్వక శుభాభినందనలు - janaSena chief Shri @PawanKalyan #DadasahebPhalkeAward #rajinikanth pic.twitter.com/3QTHowap16Heartfelt congratulations to Sri @rajinikanth
— JanaSena Party (@JanaSenaParty) April 1, 2021
శ్రీ @rajinikanth గారికి హృదయపూర్వక శుభాభినందనలు - janaSena chief Shri @PawanKalyan #DadasahebPhalkeAward #rajinikanth pic.twitter.com/3QTHowap16
"విలక్షణ నటుడు శ్రీ రజనీకాంత్ గారు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన విషయం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తమిళ ప్రేక్షకులను గత నాలుగున్నర దశాబ్దాలుగా మెప్పిస్తున్న శ్రీ రజనీకాంత్ గారు ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హులు. తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్నీ దక్కించుకున్నారు. మా కుటుంబానికి ఆయన ఎంతో సన్నిహితులు. దాదాపు 30 ఏళ్ల కిందట అన్నయ్య చిరంజీవి గారితో కలిసి ఆయన నటించిన 'బందిపోటు సింహం', 'కాళీ' అనే చిత్రాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. శ్రీ రజనీకాంత్ గారు మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాను".
- పవన్ కల్యాణ్, కథానాయకుడు
51వ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. సినీ రంగంలో అత్యున్నత పురస్కారం రావడం పట్ల రజనీ కుటుంబసభ్యులు, అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం