ETV Bharat / sitara

అప్పట్లో 'అడవి రాముడు'.. ఇప్పుడేమో 'జాతిరత్నాలు'! - పరుచూరి పలుకులు జాతిరత్నాలు

ఇటీవలే విడుదలైన 'జాతిరత్నాలు' సినిమా లాగే.. అప్పట్లో ఎన్టీఆర్​ నటించిన 'అడవి రాముడు' గురించి ఇదే విధంగా చర్చించుకున్నారని అంటున్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. నవీన్​ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాపై యూట్యూబ్​లో 'పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Paruchuri Gopala Krishna Talks About Jathi Ratnalu Movie
అప్పట్లో 'అడవి రాముడు'.. ఇప్పుడేమో 'జాతిరత్నాలు'!
author img

By

Published : May 3, 2021, 9:16 AM IST

ఇప్పుడు 'జాతిరత్నాలు' సినిమా గురించి చాలామంది ఏం మాట్లాడుకుంటున్నారో.. అప్పట్లో 'అడవి రాముడు' గురించి కూడా ఇలాగే ఆశ్చర్యంగా చర్చించుకున్నారని ప్రముఖ రచయిత గోపాలకృష్ణ అన్నారు. 'పరుచూరి పలుకులు'లో భాగంగా 'జాతిరత్నాలు' సినిమాపై ఆయన తన విశ్లేషణ పంచుకున్నారు. "అందని ఆకాశం కోసం అర్రులు చాచే కంటే.. అందిన అవకాశాన్ని చేజిక్కించుకోవడం మంచిది.. ఇదే 'జాతిరత్నాలు' చెప్పిన నీతి" అని ఆయన అన్నారు.

"ఈ సినిమా ఎందుకు ఆడిందో తెలియదని చాలామంది నాతో అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌ గారి చిత్రం 'అడవి రాముడు' థియేటర్లలో హౌస్‌ఫుల్‌ బోర్డులతో ఆడుతున్న సమయంలో.. 'ఈ సినిమాలో ఏముందని ఇంతలా ఆడుతోందని' చాలామంది అన్నారు. ఆ సినిమాలో ఏముందో ఈ 'జాతిరత్నాలు' చిత్రంలోనూ అదే ఉంది. అదే 'ఎంటర్‌టైన్మెంట్‌'. అక్కడ జంధ్యాల గారు.. రాఘవేంద్రరావు గారు.. అన్నగారు(ఎన్టీఆర్‌) ఆ సినిమాను కాపాడితే.. ఇక్కడ అనుదీప్‌, నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌, ప్రియదర్శి, ఫరియా.. ఈ నలుగురూ సినిమాకు నాలుగు స్తంభాల్లా పనిచేశారు. తన కలను నెరవేర్చుకోవడం సహా తండ్రి కోరికను తీర్చిన.. తండ్రి కొడుకుల కథే ఈ సినిమా. హాస్యమే ఈ సినిమా బలం. ఆ హాస్యాన్ని అనుక్షణం పండించుకుంటూ రావడం వల్లే చిత్రం ఇంత పెద్ద హిట్‌ అయింది. అల్లరి నరేశ్‌లాంటి వాళ్లు చేయాల్సిన సినిమా ఇది.. కానీ.. ముగ్గురు కలిసి బాగా నవ్వులు పండించారు. ఈ సినిమాలో నవ్వించకుండా ఉండే పాత్ర ఏదైనా ఉందంటే అది శుభలేఖ సుధాకర్‌ పాత్ర ఒక్కటే. తన తండ్రి పెట్టిన సంస్థను ఎంత కష్టం వచ్చినా అమ్ముకోవద్దనే సిద్ధాంతం ఆయనది. ఇక సినిమాను ఎవరి అంచనాలకు అందకుండా తెరకెక్కించారు" అని పరుచూరి అన్నారు.

ఇదీ చూడండి: 'నా జీవితంలో జరిగినవన్నీ అనూహ్యమే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.