ETV Bharat / sitara

'సైనా..' కోసం పరిణీతి కఠోర సాధన - ముంబయిలో శిక్షణ

ప్రముఖ షట్లర్​ సైనా నెహ్వాల్​ బయోపిక్​ కోసం బాలీవుడ్​ తార పరిణీతి చోప్రా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభం కాగా... ఇందుకోసం బ్యాడ్మింటన్​ కోర్టులో తీవ్రంగా కష్టపడుతోందీ నటి. తాజాగా ముంబయిలోని నేవీ రామ్​సేత్​ థాకుర్​ ఇంటర్నేషనల్​ స్పోర్ట్స్​ కాంప్లెక్స్​లో 15 రోజులు షటిల్​ నేర్చుకునేందుకు వెళ్లింది.

'పరిణీతి' ఆ సినిమాకోసం 15రోజుల కసరత్తులు
author img

By

Published : Nov 5, 2019, 7:44 PM IST

సినిమాలోని పాటల్లో హీరోతో కలిసి సరదాగా ఓ నాలుగు స్టెప్పులు వేయడం, అప్పుడప్పుడూ వచ్చే గ్లామర్‌ పాత్రలు పోషించడం హీరోయిన్‌లకు కాస్త తేలికైన పని. కాని కొన్ని చిత్రాల్లో సవాళ్లు విసిరే పాత్రలూ వస్తుంటాయి. అలాంటప్పుడే సత్తా చాటాలి. పాత్రకు న్యాయం చేసేందుకు ఎంతటి కష్టానికైనా సిద్ధపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అదే పనిలో ఉంది బాలీవుడ్‌ నాయిక పరిణీతి చోప్రా.

ఈ అమ్మడు ప్రస్తుతం.. బ్యాడ్మింటన్​ స్టార్​ సైనా నెహ్వాల్​ బయోపిక్​లో నటిస్తోంది. ఇందులో షట్లర్​ పాత్ర కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది పరిణీతి. తాజాగా మరింత తర్ఫీదు కోసం ముంబయిలోని నేవీ రామ్​సేత్​ థాకుర్​ ఇంటర్నేషనల్​ స్పోర్ట్స్​ కాంప్లెక్స్​లో... 15 రోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరైంది.

"ఇంటినుంచి ఇక్కడికి రావాలంటే కనీసం నాలుగు గంటలు సమయం వృథా అవుతోంది. అందుకే ఇక్కడే 15 రోజులు ఉండాలని నిర్ణయం తీసుకున్నా. శిక్షణ పొందుతున్న స్టేడియంలోనే చిత్రషూటింగ్​ జరుగుతుంది"

-- పరిణీతి చోప్రా, బాలీవుడ్​ నటి.

ఆటపై మరింత పట్టు సాధించేందుకు.. కుటుంబం, స్నేహితులకు తక్కువ సమయాన్నే కేటాయిస్తోందట పరిణీతి. అంతేకాకుండా స్టార్​ నటి ఒక సాధారణ గదిలో ఉంటూ... ఆహార విషయంలోనూ క్రీడాకారుల డైట్​నే పాటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అమోల్‌ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి భూషణ్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇవీ చూడండి.. 'ప్రేమ గుణపాఠం నేర్పితే.. విస్కీ నన్ను మార్చింది'

Viral Advisory
Tuesday 5th November 2019
Clients please note, the following additional story has been made available:
VIRAL (BASEBALL): Washington Nationals catcher Kurt Suzuki received a surprise hug from United States president Donald Trump after he wore a MAGA (Make America Great Again) cap at the White House.
Regards,
SNTV London
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.