ETV Bharat / sitara

నిద్రలో ఉన్నా.. శాశ్వత నిద్రలో కాదు: పరేశ్​ రావల్

author img

By

Published : May 15, 2021, 2:57 PM IST

తాను చనిపోయానంటూ వస్తున్న వార్తలపై ప్రముఖ నటుడు పరేశ్​ రావల్ స్పందించారు. ఫేక్​ న్యూస్​పై తనదైన శైలిలో వ్యంగస్త్రం వేశారు.

Paresh Rawal quashes death rumours
పరేశ్ రావల్

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం విజృంభిస్తోన్న వేళ సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. సోషల్‌మీడియా ఓపెన్‌ చేస్తే ఓ వైపు కరోనా వైరస్‌, మరోవైపు సెలబ్రిటీల ఆరోగ్య పరిస్థితులు గురించి ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ ప్రముఖ నటుడు పరేశ్‌ రావల్‌ మరణించినట్లు శుక్రవారం ఉదయం నెట్టింట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఆయన అనారోగ్యం కారణంగా నిన్న ఉదయం ఏడు గంటలకు కన్నుమూశారని వార్తలు దర్శనమిచ్చాయి. అయితే వీటిపై పరేశ్‌ రావల్‌ సెటైరికల్‌గా స్పందించారు. 'క్షమించండి.. మీరు చెబుతున్నట్లు ఏడు గంటల సమయంలో నేను నిద్రలో ఉన్నా. శాశ్వత నిద్రలో కాదు' అని పోస్ట్ పెట్టారు.

బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో నటించిన పరేశ్‌ రావల్‌.. ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా మెప్పించారు. ‘మనీ’తో ఆయన నటుడిగా తెలుగు తెరపై మెరిశారు. ‘గోవిందా గోవిందా’, ‘మనీ మనీ’, ‘బావగారు బాగున్నారా’ తదితర సినిమాలతో ఆకట్టుకున్నారు. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’తో లింగం మావయ్యగా తెలుగువారికి మరింత చేరువయ్యారు.

మరోవైపు మార్చి నెలలో ఆయన కొవిడ్‌-19 బారినపడ్డారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ అప్పట్లో ట్వీట్‌ పెట్టారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల సూచనలు పాటించి కరోనా నుంచి కోలుకున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.