ETV Bharat / sitara

పాన్​ఇండియా సినిమాల కోసం బాలీవుడ్​ భామలు! - పవన్​ సినిమాలో జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​

పాన్‌ ఇండియా సినిమాల ప్రభావంతో భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. తెలుగు సినిమా ముంబయిలో అదరగొడుతోంది. దక్షిణాది తారలు ఉత్తరాది ప్రేక్షకులను మురిపిస్తున్నారు. ఒక మోస్తరు బడ్జెట్‌తో సినిమా తీస్తున్నారంటే చాలు.. దానికి పాన్‌ఇండియా రంగు పూసే ప్రయత్నం కనిపిస్తుంటుంది. అందులో భాగమే విలన్‌గానో, హీరోయిన్‌గానో జాతీయ స్థాయిలో గుర్తింపున్న తారల్ని దిగుమతి చేసుకోవడం. అలాంటి ప్రయత్నాలు ఈమధ్య ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇటీవల బాలీవుడ్‌ నాయికల పేర్లు మాత్రం తెలుగులో గట్టిగానే వినిపిస్తున్నాయి.

Pan-India films on the hunt for Bollywood Star Heroines
పాన్​ఇండియా సినిమాల్లో బాలీవుడ్​ భామలు!
author img

By

Published : Sep 17, 2020, 7:27 AM IST

ఆలియా భట్‌, అనన్యా పాండే, ఊర్వశి రౌతేలా... ఇలా బాలీవుడ్‌ నాయికలు ఇప్పటికే తెలుగులో సినిమాలు చేస్తున్నారు. కియారా అడ్వాణీ క్రమం తప్పకుండా సినిమాలు చేస్తోంది. త్వరలోనే మరో చిత్రం చేస్తానని ఆమె ఇటీవల ప్రకటించింది. ప్రభాస్‌తో కలిసి నటించేందుకు దీపికా పదుకొణే కూడా పచ్చజెండా ఊపేసింది. వీళ్లతోపాటు మరికొంతమంది తారల్ని తెలుగు చిత్రసీమ రారమ్మంటోందా? ఈ ప్రశ్నకి అవుననే సమాధానమే వినిపిస్తున్నాయి పరిశ్రమ వర్గాలు.

Pan-India films on the hunt for Bollywood Star Heroines
విద్యా బాలన్​

మహేశ్ సినిమాలో విద్యాబాలన్!

మహేశ్​బాబు కథా నాయకుడిగా తెరకెక్కుతున్న 'సర్కారు‌ వారి పాట' విషయంలో పలువురు బాలీవుడ్‌ తారల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో అనిల్‌ కపూర్‌ ఒకరు, విద్యాబాలన్‌ మరొకరు. ప్రతినాయకుడిగా అనిల్‌ కపూర్‌ని ఎంపిక చేసే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. అగ్రనాయిక విద్యాబాలన్‌ను కూడా ఓ కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

జాన్వీ కపూర్​

ఎన్టీఆర్​ సరసన జాన్వీ కపూర్​

శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ కోసం తెలుగు చిత్రసీమ ఎప్పుడో ఎర్ర తివాచీ పరిచింది. ఆమె తొలి సినిమా తెలుగులోనే చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ హిందీలోనే ఆమె తెరంగేట్రం చేశారు. ఆ తర్వాతా పలు తెలుగు కథలు ఆమె దగ్గరికి వెళ్లాయి కానీ కుదరలేదు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న సినిమా విషయంలో జాన్వి పేరు వినిపిస్తోంది. త్రివిక్రమ్‌ సినిమాలోని ఓ నాయిక పాత్ర కోసం జాన్విని సంప్రదిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అందులో నిజం ఎంతన్నది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​

జాక్వెలిన్‌ ఓకే అయ్యిందా?

బాలీవుడ్‌కి చెందిన మరో అందాల నాయిక జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. ఆమె పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించబోతున్నట్టు సమాచారం. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. పవన్‌ ప్రస్తుతం చేస్తున్న 'వకీల్‌సాబ్‌' పూర్తి కాగానే ఆ చిత్రం పట్టాలెక్కబోతోంది. అందులోనే జాక్వెలిన్‌ కథానాయికగా నటించనున్నట్టు సమాచారం.

దీపికా పదుకొణె

ఉత్తరాది భామల కోసం

ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కబోతున్న 'ఆదిపురుష్‌' చిత్రానికి సంబంధించి అందులోని సీత పాత్ర కోసం దక్షిణాది తారలతో పాటు బాలీవుడ్‌ భామల్ని కూడా సంప్రదిస్తున్నారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'పుష్ప'లో ప్రత్యేకగీతం కోసం 'సాహో' భామ శ్రద్ధాకపూర్‌ను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఆ చిత్రబృందం ఉన్నట్టు తెలిసింది.

ఇలా బాలీవుడ్‌ భామలకి తెలుగు సినిమా నుంచి పిలుపులు గట్టిగానే వెళుతున్నాయి. మరి అక్కడే బిజీ బిజీగా గడుపుతున్న ఆ ముద్దుగుమ్మల్లో ఎంతమంది తెలుగు సినిమాల్ని చేయడానికి ఒప్పుకుంటారనేది చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.