ETV Bharat / sitara

పాకిస్థాన్​లో భారతీయ చిత్రాలపై నిషేధం - artical 370

భారతీయ సినిమాలపై పాకిస్థాన్ నిషేధం విధించింది. జమ్ముకశ్మీర్​కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దుచేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

సినిమా
author img

By

Published : Aug 8, 2019, 8:01 PM IST

పాకిస్థాన్​లో భారతీయ సినిమాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని మోదీ సర్కార్ రద్దు చేయడమే ఈ నిర్ణయానికి కారణంగా చెప్పింది.

పాక్​లో ప్రస్తుతం ప్రదర్శితమతున్న భారతీయ సినిమాలనూ నిలిపివేసింది. ఇప్పటి నుంచి కొత్త చిత్రాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది.
పాకిస్థాన్​లో బాలీవుడ్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. అక్కడి థియేటర్లకు 70 శాతం ఆదాయం భారతీయ సినిమాల ద్వారానే వస్తుంది. బాలీవుడ్ హీరో సంజయ్​దత్ నటించిన 'సంజూ', సల్మాన్​ ఖాన్ 'సుల్తాన్' సినిమాలు 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తాచాటాయి.

ఇలా భారతీయ సినిమాలపై దాయాది దేశం నిషేధం విధించడం ఇది రెండోసారి. ఇంతకుముందు పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు భారత్​ పాక్​లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ సమయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది పాక్​ ప్రభుత్వం.

ఇవీ చూడండి.. బాహుబలి సన్నివేశానికి డాక్టర్​ స్ట్రేంజ్​​ దర్శకుడు ఫిదా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.