ETV Bharat / sitara

నిశ్చితార్థం జరిగాక బ్రేకప్ చెప్పిన నటి

'హిందీ మీడియం' ఫేమ్ సబా ఖమర్ తన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇటీవలే వ్యాపారవేత్త అజీమ్​ ఖాన్​తో ఈమె నిశ్చితార్థం జరిగింది. కాగా కొన్ని కారణాల వల్ల తమ పెళ్లి జరగబోదని స్పష్టం చేసింది సబా.

Saba Qamar
సబా ఖమర్
author img

By

Published : Apr 3, 2021, 9:43 AM IST

ఇర్ఫాన్‌ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'హిందీ మీడియం'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పాకిస్థానీ నటి సబా ఖమర్. వ్యాపారవేత్త అజీమ్‌ ఖాన్‌తో ఇటీవల ఆమె నిశ్చితార్థం జరిగింది. కాగా, తాజాగా ఈ భామ పెళ్లికి బ్రేకప్‌ చెబుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది.

Saba Qamar post
సబా ఖమర్ పోస్ట్

"వ్యక్తిగత కారణాల వల్ల అజీమ్ ఖాన్‌తో నా ఎంగేజ్‌మెంట్‌ తర్వాత బ్రేకప్‌ చెప్తున్నాను. మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పటివరకూ నాకు మద్దతుగా నిలిచిన మీరందరూ ఇకపైనా నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను. ఆలస్యం కాకుండా సరైన సమయంలోనే చేదు నిజాలను గ్రహించా. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నేను అజీమ్‌ ఖాన్‌ను ఇప్పటివరకూ కలవలేదు. కేవలం ఫోన్ల ద్వారా మాత్రమే మేమిద్దరం మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా ఇది నాకెంతో కఠినమైన సమయం. కానీ ఇది కూడా ముగిసిపోవాల్సిందే."

-సబా ఖమర్, నటి

కాగా, సబా పెట్టిన పోస్టుపై అజీమ్‌ స్పందించాడు. "సబా.. నువ్వు మంచి మనసున్న వ్యక్తివి. ఈ భూమ్మీద ఉన్న సంతోషమంతా నీకు దక్కాలని ఆశిస్తున్నా. దేవుడు నీకు అన్నివేళలా విజయాన్నే అందించాలని కోరుకుంటున్నా. ముళ్లబాట చిట్టచివరికి అందమైన గమ్యస్థానానికి చేరుస్తుంది. అలాగే ఈ బ్రేకప్‌ పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా" అని రిప్లై ఇచ్చాడు.

Saba Qamar
సబా ఖమర్

అజీమ్‌కు సబాతో ఎంగేజ్‌మెంట్‌ జరిగిన కొన్ని రోజులకే అతనిపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే అజీమ్‌తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సబా ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.