బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, కార్తిక్ ఆర్యన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించాడు. అయితే ఇటీవల ప్రభాస్ హీరోగా 'ఆదిపురుష్' చిత్రం చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమా ప్రకటన, కార్తిక్ నటించే యాక్షన్ చిత్రానికి సంబంధించి ఎటువంటి వార్త లేకపోవడం వల్ల కార్తిక్ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ స్పందించాడు.
"కార్తిక్ ఆర్యన్‌తో సినిమా కచ్చితంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం కొవిడ్-19 కారణంగా అనివార్యమైన జాప్యం జరిగింది. అంతేకానీ మరో విశేషం ఏమీలేదు. చిత్రాన్ని విదేశాల్లో చిత్రీకరించాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు విదేశాలకు వెళ్లడం అంత ఈజీ కాదు. అందుకే సినిమా స్క్రిప్టులోనే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది."
-ఓం రౌత్, దర్శకుడు
కార్తిక్ ఆర్యన్ ప్రస్తుతం 'భూల్ భులయ్యా2', 'దోస్తనా 2' చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ చిత్రాల తరువాత రోహిత్ ధావన్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాలో హీరోగా చేయనున్నాడు.