హిందీ సినీ నటి స్వరా భాస్కర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నాలుగేళ్ల ఓ బాల నటుడిని అసభ్య పదజాలంతో దూషించడమే ఇందుకు కారణం. తాజాగా సామాజిక మాధ్యమాల్లో #Swara_aunty ట్యాగ్‌తో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ హ్యాష్‌ట్యాగ్ నేడు ట్విట్టర్లో ట్రెండింగ్‌లో నిలిచింది.
ఏమైంది..?
టీవీలో ఓ 'చాట్ షో'కు హాజరైన స్వర.. తనకు గతంలో జరిగిన ఓ అనుభవాన్ని చెప్పింది. సినిమా చిత్రీకరణ సమయంలో 4ఏళ్ల బాల నటుడు ఆమెను 'ఆంటీ' అని పిలిచాడని చెప్తూ... ఆ చిన్నారిని వేదికపైనే తిట్టింది. చిన్నారి గురించి వాడిన పదాలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
-
He calling you aunty is way more respectful than you calling a 4yo kiddo chut!y@. #learntorespect #swara_aunty https://t.co/zdlg8tSNBH
— Howlet (@Howlet14139570) November 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">He calling you aunty is way more respectful than you calling a 4yo kiddo chut!y@. #learntorespect #swara_aunty https://t.co/zdlg8tSNBH
— Howlet (@Howlet14139570) November 4, 2019He calling you aunty is way more respectful than you calling a 4yo kiddo chut!y@. #learntorespect #swara_aunty https://t.co/zdlg8tSNBH
— Howlet (@Howlet14139570) November 4, 2019
ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకున్న ఆమె.. "షూట్ సమయంలో చిన్నారిని తిట్టలేదు. కానీ నా మనసులో అనుకున్నది ఆ టీవీ షోలో వెల్లడించా" అని చెప్పింది. 'ఆంటీ' అని పిలవడం తనకు కొంచెం కోపం తెప్పించిందని తెలిపింది.
ఈ ఘటనపై ఓ స్వచ్ఛంద సేవా సంస్థ స్వరా భాస్కర్‌పై జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు(ఎన్సీపీసీఆర్)కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
స్వర ప్రస్తుతం 'షీర్ కోర్మా' సినిమాలో బిజీగా ఉంది. త్వరలో 'రాష్భారీ' అనే వెబ్ సిరీస్ ద్వారా స్మార్ట్తెరపైనా సందడి చేయనుంది.