యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కోసం యూరప్ హైదరాబాద్‌కు వచ్చింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'రాధేశ్యామ్' కోసం యూరప్ తరహా కొన్ని నిర్మాణాల్ని భాగ్యనగరంలో సెట్స్‌గా తీర్చిదిద్దారు. వాటిలో చిత్రీకరణ కోసం సన్నాహాలు చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రభాస్, ఆయన బృందం రంగంలోకి దిగబోతోంది. ఇక్కడ చిత్రీకరణ చేసినా, మరోసారి యూరప్ వెళ్లనున్నట్టు సమాచారం.
ఇప్పటికే పలుమార్లు అక్కడకు వెళ్లి షూటింగ్ చేసుకొచ్చిన చిత్రబృందం, మరోమారు వెళ్లేందుకు ప్రణాళికలు రచించినట్లు సమాచారం. రాజీ పడకుండా సినిమాను తీర్చిదిద్దేందుకే ఆ నిర్ణయం తీసుకున్నారట. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ఇప్పటికే సగభాగానికి పైగా సినిమాను పూర్తి చేశారు. వచ్చే ఏడాదిలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.