స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలు చేస్తూ జోరు మీదున్నాడు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న '#అల్లు అర్జున్ 19' ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్లో నేటి నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. కుటుంబ నేపథ్యమున్న కథాంశంతో ఈ సినిమాను తీస్తున్నారు.
బన్నీ సరసన హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి నటిస్తోంది. వీరిద్దరూ గతంలో దువ్వాడ జగన్నాథం సినిమాలో జోడీ కట్టారు. ఏఏ19 చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: కిచ్చా 'పహిల్వాన్'కు మెగాస్టార్ మద్దతు