ETV Bharat / sitara

'లావుగా ఉన్నప్పుడు రాజమౌళి అలా అన్నారు' - meelo evaru koteeswarudu ntr episode

ఇండస్ట్రీకి వచ్చిన కొన్నేళ్ల పాటు హీరో ఎన్టీఆర్​ చాలా లావుగా ఉండేవారు. ఆ సమయంలో దర్శకుడు జక్కన తనతో ఓ మాట అన్నారని గుర్తుచేసుకున్నారు తారక్​. అలానే చిత్రసీమలో రావాలనుకునే వాళ్లకు ఓ సలహా కూడా ఇచ్చారు యంగ్ టైగర్.

ntr
ఎన్టీఆర్​
author img

By

Published : Sep 1, 2021, 10:22 PM IST

వెండితెరపైనే కాదు, బుల్లితెరపైనా తనదైన శైలిలో అదరగొడుతున్నారు స్టార్‌ హీరో ఎన్టీఆర్‌. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, అందరితోనూ కలిసిపోవడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే గతంలో ఆయన చేసిన షో విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆయన వ్యాఖ్యాతగా 'ఎవరు మీలో కోటీశ్వరులు'(meelo evaru koteeswarudu ntr episode) ప్రసారమవుతోంది. ఈ షోలోనూ తనదైన వాగ్దాటితో మెప్పిస్తున్నారు.

తాజాగా ఈ షోలో హాట్‌సీట్‌లో కూర్చొన్న ఒక కంటెస్టెంట్‌ తనకున్న బట్టతల కారణంగా ఆత్మన్యూనత భావానికి గురయ్యేవాడినని, పలువురు చేసే కామెంట్స్‌కు చాలా బాధపడేవాడినని చెప్పారు. ఇది విన్న ఎన్టీఆర్‌ తన బరువు విషయంలో జరిగిన ఒక సంఘటనను ఈ వేదికపై పంచుకున్నారు. తాను లావుగా ఉండటం చూసి రాజమౌళి(ntr rajamouli movies ) ఏమన్నారో దాచుకోకుండా చెప్పి అందరి హృదయాలు గెలుచుకున్నారు.

"నేను ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్లు దాటింది. తొలినాళ్లలో చాలా లావుగా ఉండేవాడిని. ఏ రోజూ నేను లావుగా ఉన్నానని నాకు అనిపించలేదు. ఒకరోజు మా జక్కన్న(రాజమౌళి) నన్ను చూసి 'అసహ్యంగా ఉన్నారు' అన్నారు. ఆ రోజు నాకు విషయం అర్థమైంది. మన చుట్టూ ఉన్న స్నేహితులు మనల్ని చక్కగా మార్గనిర్దేశం చేస్తారు. వాళ్లే మన నిజమైన స్నేహితులు. మీది జుట్టు సమస్య.. నాది కొవ్వు సమస్య.. అంతే తేడా" అని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చారు.

అంతేకాదు, ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్లకు ఒక సలహా కూడా ఇచ్చారు. "నటనలో రాణించాలంటే మనకు కావాల్సింది నిజాయతీ. మనకు చాలా తెలుసు అనుకుంటాం. మనకు ఏదీ తెలియదు. ప్రపంచంలో ఎన్నో విషయాలు మనకు తెలియనివి జరుగుతుంటాయి. అవన్నీ పట్టించుకోకుండా మనకు చాలా తెలుసని ధైర్యంతో ఉంటాం. మన కోరిక వైపు చాలా బలంగా ప్రయాణించాలి" అని ఎన్టీఆర్‌ చెప్పడం అభిమానులతో పాటు, వీక్షకులను సైతం చప్పట్టు కొట్టేలా చేసింది.

ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో(ntr rrr look) నటిస్తున్నారు. ఇందులో ఆయన కొమురం భీమ్​గా కనిపించనున్నారు. రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.

ఇదీ చూడండి: ఒకే వేదికపై తారక్​- చెర్రీ.. అభిమానులకు పండగే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.