ETV Bharat / sitara

సుశాంత్​ కేసులో సీబీఐ విచారణ అనవసరం: హోంమంత్రి

author img

By

Published : Jul 17, 2020, 5:21 PM IST

సుశాంత్​ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని స్పష్టం చేశారు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​. ఈకేసును ముంబయి పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.

No need for CBI probe in Sushant death case: Deshmukh
సుశాంత్

బాలీవుడ్​ హీరో సుశాంత్​ రాజ్​పుత్​​ మృతిపై సీబీఐ విచారణ అవసరం లేదని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ తెలిపారు. ఈ కేసును ముంబయి పోలీసులు పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. జూన్​ 14న ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్​. మానసిక ఒత్తిడి కారణంగానే ఈ నటుడు చనిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ క్రమంలోనే రాజ్​పుత్​ చనిపోవడానికి ఎటువంటి ఒత్తిళ్లు కారణమో తెలియాలంటే సీబీఐ దర్యాప్తు చేయాలని అతని​ ప్రేయసి, నటి రియా చక్రవర్తి ట్విట్టర్​ వేదికగా డిమాండ్ చేసింది. ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉందని సీబీఐతోనే సుశాంత్​ మృతికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:'సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి'

అయితే, ఈ కేసును ముంబయి పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని దేశ్​ముఖ్​ వెల్లడించారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు సహా 35 మందిని విచారించారు పోలీసులు. ఇటీవలే ప్రముఖ దర్శకుడు సంజయ్​లీలా భన్సాలీ వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. సుశాంత్​ మరణానికి వ్యాపార శత్రుత్వం ఏమైనా కారణమా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.