ETV Bharat / sitara

'చెక్'​ లిరికల్​ సాంగ్​.. '101 జిల్లాల అందగాడు' రిలీజ్​ డేట్​ ​​

author img

By

Published : Feb 17, 2021, 5:12 PM IST

కొత్త సినిమా కబుర్లు మీ ముందుకొచ్చేశాయి. నితిన్​ 'చెక్​' సినిమాలోని ఓ ప్రేమ గీతం విడుదలైంది. దీంతోపాటు '101 జిల్లాల అందగాడు', కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ నటించిన 'యువరత్న' సినిమాకు సంబంధించిన థర్డ్​ సింగిల్, ధనుష్​ నటిస్తోన్న 'కర్ణన్'​ ఫస్ట్​ సింగిల్​​ విడుదల తేదీ వివరాలు ఉన్నాయి.

check
చెక్​

నితిన్​ 'చెక్'​ సినిమాలోని 'నిన్ను చూడకుండా' లిరికల్​ సాంగ్​ విడుదలైంది. ఈ పాట శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. కల్యాణి మాలిక్ సంగీతమందించగా, చంద్రశేఖర్​ యేలేటి దర్శకత్వం వహించారు. వి.ఆనందప్రసాద్ నిర్మించారు. ఈ నెల 26 నుంచి థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.

నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నటించిన '101 జిల్లాల‌ అంద‌గాడు' సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది మే 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సాగర్​ రాచకొండ దర్శకత్వం వహించారు. నిర్మాత దిల్​రాజు​ సమర్పణలో రూపొందిందీ చిత్రం.

అల్లరినరేశ్​ నటించిన 'నాంది' సినిమాలో 'దేవతలంతా' పాట విడుదల అయింది. ఈ పాట సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ నెల 19న విడుదల కానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ధనుష్‌ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం 'కర్ణన్‌'. సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​ సింగిల్​ను ఫిబ్రవరి18న సాయంత్రం 8గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ 'యువరత్న' సినిమా నుంచి థర్డ్​ సింగిల్​ ఫిబ్రవరి 21న సాయంత్రం 4.20గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది ఏప్రిల్ 1న థియేటర్లలో ప్రేక్షకుల ముందు సందడి చేయనుందీ సినిమా.

విశ్వక్​సేన్​ నటించిన 'పాగల్'​ సినిమా టీజర్​ను ఫిబ్రవరి 18న ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నారు.

ఇదీ చూడండి: ఇన్​స్టాలో 'ఏకాంతవాసం'.. తారల ఫోజులకు నెటిజన్లు ఫిదా.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.