స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'నిశ్శబ్దం'. మాధవన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హారర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. టీజర్‌ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్.. బుధవారం విడుదల చేశాడు. ఆద్యంతం ఆకట్టుకుంటూ అంచనాలు పెంచుతోంది.
ఓ ప్రాంతానికి వెకేషన్ కోసం అనుష్క-మాధవన్ వెళతారు. ఆ సమయంలో ఓ ప్రమాదం జరుగుతుంది. మాధవన్ చనిపోతాడు. ఇంతకీ అతడ్ని చంపింది ఎవరు? అక్కడ అసలేం జరిగింది? తదితర అంశాలు తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇందులో అనుష్క.. సాక్షి అనే దివ్యాంగురాలిగా నటిస్తోంది. మైకేల్ మ్యాడ్సన్, షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ సంగీతమందించాడు. హేమంత్ మధుకర్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్ నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'భాగమతి' వంటి హిట్ తర్వాత స్వీటీ నటిస్తున్న చిత్రమిది.
ఇది చదవండి: అనుష్కతో ప్రేమ-పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ..!