టాలీవుడ్ యువహీరో నిఖిల్.. కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్ నిర్ణయించారు. సుకుమార్ నిర్మిస్తూ, కథ, స్క్రీన్ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి '18 పేజెస్' అనే పేరు పెట్టారు. సంబంధిత పోస్టర్ను నేడు(గురువారం) విడుదల చేశారు.

'కుమారి 21 ఎఫ్'తో ఆకట్టుకున్న పల్నాటి సూర్యప్రతాప్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
గతేడాది 'అర్జున్ సురవరం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నిఖిల్. ఇటీవలే 'కార్తికేయ 2' షూటింగ్ తిరుపతిలో ప్రారంభమైంది. దీనితోపాటే ఏప్రిల్లో వివాహం చేసుకోనున్నాడీ కథానాయకుడు.
ఇదీ చూడండి.. ఆరేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యాను: నటి రష్మీ