ETV Bharat / sitara

'డాక్టర్​తో ప్రేమలో ఉన్నా... రీతూనే పెళ్లాడతా' - nikhil want to marry ritu varma

విభిన్న పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు యువ హీరో నిఖిల్. తాజాగా లక్ష్మీ మంచు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆమె అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో ఆసక్తికర జవాబులిచ్చాడు.

నిఖిల్
author img

By

Published : Oct 15, 2019, 7:05 PM IST

Updated : Oct 15, 2019, 9:28 PM IST

"రీతూని పెళ్లి చేసుకుంటా.. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. రేపు నాకు పుట్టబోయే పాప పేరు ఎప్పుడో నిర్ణయించేసుకున్నా" అంటూ తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర అభిమానులతో పంచుకున్నాడు యువ హీరో నిఖిల్. తెలుగు చిత్రసీమలో వైవిధ్యభరిత చిత్రాలకు చిరునామాగా నిలుస్తూ... సినీప్రియుల మదిలో చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడీ హీరో. తాజాగా మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు నిఖిల్‌. ఈ సందర్భంగా ఆమె అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో ఆసక్తికర జవాబులిచ్చాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

లావణ్యతో డేట్‌కు వెళ్తా...!

"హెబ్బా పటేల్‌, లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ.. ఈ ముగ్గురిలో ఎవరిని చంపుతారు, ఎవరితో డేట్‌కు వెళ్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు" అని నిఖిల్‌ను అడగ్గా.. హెబ్బాను చంపాలనుందని చెప్పాడు నిఖిల్‌. "సెట్స్‌లో హెబ్బా కొన్నిసార్లు తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో నాకర్థం కాదు కానీ, తెగ విసిగిస్తుంది (నవ్వుతూ). అందుకే తనని పక్కా చంపేస్తా. నిజం చెప్పాలంటే తనొక అద్భుతమైన నటి. ఇక లావణ్యతో మాత్రం డేట్‌కు వెళ్లాలనుంది. తను సెట్స్‌లోకి అడుగుపెట్టిందంటే చాలు.. ఒక్కసారిగా అందరి చూపులు ఆమె వైపే వెళ్తాయి. ఇంత అందంగా ఉందేంటిరా బాబు అనిపిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం రీతూ వర్మనే ఎంపిక చేసుకుంటా. తనెంతో చక్కగా తెలుగు మాట్లాడుతుంది. ఆమెతో సెట్స్‌లో చాలా సౌకర్యంగా అనిపిస్తుంటుంది" అని చెప్పాడు.

డాక్టర్‌తో ప్రేమలో ఉన్నా..

"నేను ప్రస్తుతం ఓ డాక్టర్‌తో ప్రేమలో ఉన్నా. తను నాకు చాలా స్పెషల్‌. చాలా మంచిది. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నేను షూటింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ చేసి విసిగించదు. స్నేహితులతో బయట పార్టీల్లో ఉన్నానంటే డిస్టర్బ్‌ చేయదు. నాపై అనుమానంతో ఫోన్లు చెక్‌ చేయడం వంటి పనులు అసలు చేయదు. నువ్వు ఎప్పుడూ నీ మనసుకు నచ్చిందే చెయ్యి.. నీకు నచ్చినట్లు ఉండు అని చక్కగా సలహా ఇస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి అమ్మాయి.. అబ్బాయి ఒకరికొకరు స్పేస్‌ ఇచ్చుకోవాలి. ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవాలి. ప్రతి రిలేషన్‌ షిప్‌లో ఇది చాలా ముఖ్యం. ఇవన్నీ నాకు ఆమెలో దొరికాయి"

-- నిఖిల్​, సినీ హీరో

నాకు పాపే కావాలి..

"నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉంటే మా చెల్లి కూతురుతో బాగా ఆడుకుంటుంటా. తనని చూసినప్పుడల్లా నాకు ఇలాంటి పాపే పుట్టాలి అనిపిస్తుంటుంది. నాకు పుట్టబోయే పాపకు ఏ పేరు పెట్టాలో కూడా ఇప్పటికే నిర్ణయించేసుకున్నా. ఒకవేళ నాకు పాప పుడితే మాయ సిద్ధార్థ్‌ అని పేరు పెట్టుకుంటా. నాకు ఆ పేరంటే చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చాడు నిఖిల్‌.

ఇవీ చూడండి.. అమితాబ్‌ను మించి షారుఖ్‌ రికార్డు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ceylanpinar (Turkey), overlooking Ras al-Ayn (Syria) - 15 October 2019
1. Various of explosions and large plumes of smoke rising
STORYLINE:
Turkey showed little sign of relenting its military offensive against Kurdish groups in northern Syria on Tuesday, as the operation entered its seventh day.
More explosions could be seen in the some areas of the key border town of Ras al-Ayn, where Turkey-allied forces continued battling Syrian Kurdish fighters.
The fighting came as Syrian government troops continued to move into towns and villages in the region, setting up a potential clash with Turkish-led forces.
The Syrian military's deployment near the Turkish border came after Syrian Kurdish forces previously allied with the US said they had reached a deal with President Bashar Assad's government to help them fend off Turkey's invasion.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 15, 2019, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.