ETV Bharat / sitara

పవన్ ‌కల్యాణ్‌కు హ్యాండిచ్చిన శృతిహాసన్‌! - పవన్​​ కల్యాణ్ కొత్త సినిమా

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్​సాబ్'​ సినిమా నుంచి మరో ఫొటో లీకైంది. శృతిహాసన్​, పవన్​​ ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఉన్న ఈ ఫొటో నెట్టింట వైరల్​ అవుతోంది. ​

new photo leaked from power star pawan kalyan new movie vakeel saab
పవన్ ‌కల్యాణ్‌.. శృతిహాసన్‌.. ఫొటో లీక్‌
author img

By

Published : Dec 21, 2020, 1:00 PM IST

'వకీల్‌సాబ్‌'లో లీకుల పర్వం కొనసాగుతూనే ఉంది. పవర్‌స్టార్‌ సినిమా అంటేనే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. పవన్‌ సినిమా ప్రకటించింది మొదలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. షూటింగ్‌ ఎంత వరకు వచ్చింది..? అసలు ఈ సినిమాలో పవర్‌స్టార్‌ లుక్‌ ఎలా ఉండబోతుంది.? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అందుకే చిత్రబృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వరుసగా ఫొటోలు లీక్‌ అవుతూనే ఉన్నాయి. ఇటీవల పవర్‌స్టార్‌ ఫొటో ఒకటి బయటికి వచ్చింది. తాజాగా మరో ఫొటో లీక్‌ అయింది. అయితే.. ఈ ఫొటో ఓ పాట చిత్రీకరణ సందర్భంగా తీసినట్లు తెలుస్తోంది. అందులో హీరోహీరోయిన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కనిపిస్తున్నారు.

new photo leaked from power star pawan kalyan new movie vakeel saab
పవన్‌ కల్యాణ్‌, శృతిహాసన్

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కథానాయిక శృతిహాసన్‌. పవన్‌, శృతి కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ఇప్పటికే 'గబ్బర్‌సింగ్‌', 'కాటమరాయుడు' సినిమాల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. హిందీలో వచ్చి మంచి విజయం సాధించిన 'పింక్‌' చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. దిల్‌రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన 'మగువా మగువా' పాట..‌ ప్రేక్షకులను బాగా అలరించింది.

ఇదీ చూడండి:నెట్టింట వైరల్​గా 'వకీల్​సాబ్​' షూటింగ్​ ఫొటోస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.