మహేష్ అభిమానుల నుంచి పూరీ జగన్నాథ్‌కు నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విమర్శలకు నొచ్చుకున్న పూరీ.. మహేష్ ప్రస్తావన తెచ్చేందుకే ఇష్టపడట్లేదు. ఇస్మార్ట్ శంకర్’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా విలేకర్లు ప్రిన్స్ గురించి అడిగిన ప్రశ్నలను దాటావేశాడు.
ఆంధ్రాలో పర్యటిస్తున్న పూరీ జగన్నాథ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా .. ఓ విలేకరి మహేష్‌పై చేసిన కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ.. ‘"మీరు ఇక మహేష్‌తో సినిమాలు చేయరా?" అని ప్రశ్నించారు. ట్రోల్ అయింది చాలు. "ఇక ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడం ఇష్టం లేదు"అని బదులిచ్చారు. కానీ, మరో విలేకరి మహేష్‌పై ఇంకో ప్రశ్న అడగ్గా.. "ఆ టాపిక్‌పై ఇక ప్రశ్నలు వద్దు" అని మరోమారు తేల్చిచెప్పాడు.
"నేను హిట్లలో ఉంటేనే మహేష్ నాతో సినిమా చేస్తాడు"’ అంటూ ఇటీవల మహేష్‌బాబుపై పూరీ జగన్నాథ్ సంచలన ఆరోపణలు చేశాడు. మహేష్‌తో ‘పోకిరి, బిజినెస్‌మెన్’ సినిమాలు చేయడానికి ముందు పూరి ప్లాపుల్లో ఉన్న సంగతిని గుర్తు చేస్తూ నెటిజన్లంతా గట్టిగా ట్రోల్స్ మొదలుపెట్టారు.
ఇది చదవండి: అలరిస్తున్న 'దర్బార్'లోని రజనీ లుక్స్