బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో నెపోటిజమ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సహా పలువురు నటీనటులు.. హిందీ చిత్రసీమలో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఉన్నాయని ఆరోపించారు. స్టార్స్ వారసులకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారని, నేపథ్యం లేనివారికి పట్టించుకోవడం లేదని విమర్శించారు. అయితే కొందరు నటులు.. స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చినా సరే కెరీర్లో వారికి హిట్స్ దక్కని సందర్భాలు అనేకం.
తనీషా
సీనియర్ నటి తనూజ కుమార్తె తనీషా.. 2005లో 'నీల్ ఎన్ నిక్కి' చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది. వరుస పరాజయాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయింది. కానీ సోదరి కాజోల్ మాత్రం స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ఉదయ్ చోప్రా
'ధూమ్' సిరీస్‌లో ఒళ్లు గగుర్పొడిచే బైక్‌స్టంట్స్ చేస్తూ, పోలీస్ ఇన్ఫార్మర్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉదయ్ చోప్రా. ఇతడు ప్రముఖ దర్శకనిర్మాత యశ్ చోప్రా చిన్న కుమారుడు. కానీ పలు సినిమాల్లో సహాయ పాత్రలే చేస్తూ పేరు తెచ్చుకున్నారు.
తుషార్ కపూర్
'గోల్మాల్' సిరీస్‌లో కడుపుబ్బా నవ్వించిన తుషార్ కపూర్.. వరుస పరాజయాలతో కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇతడు ప్రముఖ నటుడు, నిర్మాత జితేంద్ర తనయుడు.
ఇషా దేఓల్
బాలీవుడ్ క్వీన్ హేమామాలిని కూతురు ఇషా దేఓల్.. తొలి చిత్రం 'ధూమ్'తో విజయం అందుకున్నా సరే ఆ తర్వాత సరైనా హిట్స్ లేక పెళ్లి చేసుకుని కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టేసింది.
ఫర్దీన్ ఖాన్
బహుముఖ ప్రజ్ఞాశాలి ఫిరోజ్ ఖాన్ తనయుడు ఫర్దీన్ ఖాన్.. 1998లో 'ప్రేమ్ అగన్'తో వెండితెర అరంగేట్రం చేశాడు. అనంతరం 'జంగిల్', 'ప్యార్ తూనే క్యా కియా' సినిమాలో నటించాడు. కానీ కెరీర్లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు.
జయద్ ఖాన్
స్టార్ దర్శకుడు సంజయ్ ఖాన్ కుమారుడు జయద్ ఖాన్.. 2003లో 'చురా లియా హై తుమ్నే' సినిమాతో పరిచయమయ్యాడు. 'మై హూ నా', 'దస్', 'ఫైట్ క్లబ్' చిత్రాల్లో నటించాడు. కానీ ఆశించినత మేర సక్సెస్ కాలేకపోయాడు.
వివేక్ ఒబేరాయ్
హీరోగా అలరించలేకపోయినా, ప్రతినాయకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వివేక్ ఒబేరాయ్. తెలుగులోనూ చివరగా రామ్‌చరణ్ 'వినయ విధేయ రామ'లో విలన్‌గా కనిపించాడు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించినా విజయాల్ని అందుకోవడంలో విఫలమయ్యాడు.
ట్వింకిల్, రింకి ఖన్నా
బాలీవుడ్ సీనియర్ స్టార్ కపుల్ రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా కుమార్తెలు ట్వింకిల్, రింకీ ఖన్నా. అయితే సినిమాల్లో అంతగా రాణించలేకపోయారు వీరిద్దరూ. స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ను వివాహమాడింది ట్వింకిల్.
మహాక్షయ్ చక్రవర్తి
మిథున్ చక్రవర్తి తనయుడు మహాక్షయ్ చక్రవర్తి. 'జిమ్మి' సినిమాతో అరంగేట్రం చేసిన సక్సెస్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
కునాల్ గోస్వామి
దిగ్గజ నటుడు మనోజ్ కుమారుడు కునాల్ గోస్వామి. 'దో గులాబీ' సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు.
రాజేంద్రకుమార్
1981లో 'లవ్‌స్టోరీ'తో అరంగేట్రం చేసిన రాజేంద్రకుమార్.. బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత సరైన సినిమాలు లేక వెనకబడిపోయాడు.
హర్షవర్ధన్ కపూర్
సీనియర్ నటుడు అనిల్‌కపూర్ కుమారుడు హర్షవర్ధన్.. 'మీర్జా'తో అరంగేట్రం చేశాడు. కానీ సరైన హిట్ దక్కించుకోలేకపోయాడు. అయితే ఇతడి సోదరి సోనమ్ కపూర్ మాత్రం, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇది చూడండి : హీరోయిన్ సారా అలీ ఖాన్ డ్రైవర్‌కు కరోనా