ETV Bharat / sitara

దీపిక, రకుల్​ మొబైల్స్ స్వాధీనం చేసుకున్న ఎన్​సీబీ - దీపిక, రకుల్​ ఫోన్లు సీజ్​ చేసిన ఎన్​సీబీ

డ్రగ్స్​ కేసులో విచారణ చేపడుతున్న మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్​సీబీ) శనివారం దీపికా పదుకొణె, సారా అలీఖాన్​, శ్రద్ధాదాస్​లతో పాటు కరిష్మా ప్రకాశ్​లను విచారించింది. దర్యాప్తులో భాగంగా రకుల్, దీపిక, కరిష్మా, సిమోను ఖంబాటాల చరవాణీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

NCB seizes phones of Deepika, Rakul, Simone, Karishma
దీపిక, రకుల్​ సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఎన్​సీబీ
author img

By

Published : Sep 27, 2020, 10:28 AM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​సింగ్ రాజ్​పుత్​ మృతి కేసు డ్రగ్స్​ కోణంలో మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్​సీబీ) విచారణను ముమ్మరం చేసింది. డ్రగ్స్​ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఫ్యాషన్​ డిజైనర్​ సిమోన్​ ఖంబాటా, రకుల్​ప్రీత్​తో పాటు దీపికా పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ను.. శనివారం దీపికా పదుకొణె, సారా అలీఖాన్​, శ్రద్ధా కపూర్​లను అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో రకుల్​ ప్రీత్, దీపికా పదుకొణె, కరిష్మా ప్రకాశ్​, ఖంబాటాల చరవాణీలను సీజ్​ చేసినట్లు ఓ ఎన్​సీబీ అధికారి వెల్లడించారు.

దీపిక, రకుల్​లను ఐదు గంటలపాటు ఈ కేసుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఖంబాటా శుక్రవారం ఎన్​సీబీ ఎదుట హాజరుకాగా.. దీపిక మేనేజర్​ కరిష్మా వరుసగా రెండో రోజూ విచారణకు వచ్చింది. వారి చరవాణుల్లో డ్రగ్స్​ చాట్​కు సంబంధించిన ఆధారాలను ఎన్​సీబీ సేకరించినట్లు సమాచారం. వీరితో పాటు సుశాంత్​ మాజీ మేనేజర్​ జయ సాహా మొబైల్​ ఫోన్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

సన్నిహితులు కావడం వల్లే

ఈ కేసులో ఇప్పటికే సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్​ చక్రవర్తితో కలిపి ఇప్పటికి 18 మందిని ఎన్​సీబీ అధికారులు అరెస్టు చేశారు. రియాకు రకుల్​ప్రీత్​, సిమోన్​ ఖంబాటాలు సన్నిహితులు కావడం వల్లే వారి సెల్​ఫోన్స్​ సీజ్​ చేశారని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.