ETV Bharat / sitara

నటుడు నవాజుద్దీన్​కు విడాకుల నోటీసులు

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్​ సిద్ధిఖీ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య ఆలియా లీగల్​ నోటీసులు పంపింది. అయితే వీటిపై నవాజుద్దీన్​ దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆలియా తరపు లాయర్​ అభయ్​ వెల్లడించారు.

author img

By

Published : May 19, 2020, 10:56 AM IST

Nawazuddin Siddiqui's wife files for divorce
నటుడు నవాజుద్దీన్​ సిద్ధిఖీకు విడాకుల నోటీసులు

బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య ఆలియా సిద్దిఖీ లీగల్‌ నోటీసులు పంపించారు. లాక్‌డౌన్ కారణంగా ఈ-మెయిల్‌, వాట్సాప్‌ల ద్వారా సిద్ధిఖీకి ఈ నెల 7న నోటీసులు పంపినట్లు ఆమె తరఫు లాయర్‌ అభయ్‌ తెలిపారు. విడిపోయిన అనంతరం ఆలియాకు చెల్లించాల్సిన భరణం గురించి అందులో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. అయితే లీగల్‌ నోటీసులపై నవాజుద్దీన్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని లాయర్​ అభయ్​ వెల్లడించారు.

నవాజుద్దీన్‌, ఆలియా 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. నవాజుద్దీన్‌ గతంలో షీబా అనే మహిళను వివాహమాడి ఆమె నుంచి విడిపోయారు.

రంజాన్‌ మాసం సందర్భంగా మే 12న నవాజుద్దీన్‌ ఆయన స్వస్థలమైన ఉత్తర్​ప్రదేశ్​లోని బుధానాకు వెళ్లారు. లాక్​డౌన్​ నిబంధనల ప్రకారం నవాజుద్దీన్​ను 14 రోజులు క్వారంటైన్​లో ఉండాలని అధికారులు సూచించారు. దీనికి కుటుంబమంతా నిర్బంధంలో ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

"మా సోదరి మరణించిన తర్వాత.. అమ్మ అనారోగ్యం పాలైంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బుధానాలోని మా నివాసంలో నిర్బంధంగా ఉంటామని" తాజాగా ట్వీట్​ చేశాడు నవాజుద్దీన్​.

ఇదీ చూడండి.. 'ఆ సినిమా షూటింగ్​లో మాకు క్యారవాన్లు లేవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.