బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆయన భార్య ఆలియాకు లీగల్ నోటిసు పంపించారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణల విషయంలో ఆమె వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సమాజంలో కీర్తిప్రతిష్టలకు భంగం కలిగించటానికే ఉద్దేశపూర్వంగా, పక్కాప్రణాళికతోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని అన్నారు. ఈ విషయాన్ని నటుడు తరఫున న్యాయవాది వెల్లడించారు.
తన భర్త నవాజూద్దీన్ నుంచి విడాకులు కావాలని మే7న కోర్టును ఆశ్రయించారు ఆలియా. అతడికి తనకు మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు.
ఈ మధ్య కాలంలో తమ పిల్లల పాఠశాల ఫీజులను నవాజుద్దీన్ కట్టడం మానేశాడని ఆలియా ఆరోపించించారు. ఆర్థిక భారం వల్ల తాను చెల్లించలేకపోతున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఖండించిన నవాజ్ న్యాయవాది.. పిల్లల పాఠశాల రుసుమును అతడు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది చూడండి : కల్యాణ్‌రామ్ కొత్త సినిమాకు దర్శకుడు ఖరారు