ETV Bharat / sitara

'శ్యామ్‌ సింగరాయ్‌' ఓటీటీ రిలీజ్‌ డేట్‌.. 'బంగార్రాజు' హంగామా - నాగార్జున

Shyam Singha Roy OTT: అద్భుతమైన కథ, ఆసక్తికర కథనంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్'. నాని, సాయి పల్లవి నటనకు అనేక ప్రశంసలు లభించాయి. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులకు శుభవార్త తెలిపింది ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​. ఈ సినిమా ఓటీటీ రిలీజ్​ డేట్​ను ప్రకటించింది.

nani
shyam singha roy
author img

By

Published : Jan 8, 2022, 5:43 PM IST

Shyam Singha Roy OTT: 'ఈ క్రిస్మస్‌ మనదే' అంటూ గతేడాది 'శ్యామ్‌ సింగరాయ్‌'తో (Shyam Singha Roy) థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనుకున్నట్టుగానే విజయాన్ని అందుకున్నారు నటుడు నాని (Nani). దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన నటించిన చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోన్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రేక్షకులు సినిమాహాళ్లకు వచ్చేందుకు కాస్త భయపడుతున్నారు. దీంతో 'శ్యామ్‌ సింగరాయ్‌' ఓటీటీ విడుదల కోసం పలువురు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'శ్యామ్‌ సింగరాయ్‌' ఓటీటీ విడుదలపై ఓ స్పష్టత వచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జనవరి 21 నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పవర్‌ఫుల్‌ కథాంశంతో రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కించిన సూపర్‌ నేచురల్ థ్రిల్లర్‌ 'శ్యామ్‌ సింగరాయ్‌'. ఇందులో నాని.. శ్యామ్‌ సింగరాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలు. బెంగాల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే శ్యామ్‌సింగరాయ్‌ కథ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 23న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'బంగార్రాజు' మేకింగ్​..

నాగార్జున నటించిన 'బంగార్రాజు' ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో ప్రచారంలో జోరు పెంచింది చిత్రబృందం. అందులో భాగంగానే సినిమా మేకింగ్​ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలో నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టి, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జనవరి 14ేన సినిమా రిలీజ్ కానుంది. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు.

ఇదీ చూడండి: టీ, సిగరెట్​లు అందించే స్థాయి నుంచి పాన్​ ఇండియా స్టార్​గా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.