ETV Bharat / sitara

కొత్త సినిమాలో 'సుందరం'గా నాని.. మరి నజ్రియా?

author img

By

Published : Nov 21, 2020, 11:56 AM IST

Updated : Nov 21, 2020, 3:18 PM IST

తన కొత్త చిత్రం కోసం సుందరం అనే విభిన్న పాత్రలో నాని కనిపించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు 'అంటే సుందరానికీ' టైటిల్​ కూడా నిర్ణయించారు.

nani new movie titled as 'ante sundharaniki', starrer nazriya nazim
నాని కొత్త సినిమా

నేచురల్ స్టార్ నాని 28వ సినిమా టైటిల్​ ఏంటో తెలిసిపోయింది. 'అంటే సుందరానికి' పేరు పెట్టినట్లు చిత్రబృందం శనివారం, కర్టెన్​ రైజర్ వీడియోను ట్వీట్ చేసింది. ఇందులో సుందరం పాత్రలో నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు నాని. 'లవ్ లైక్ నెవ్వర్ భిఫోర్.. లాఫ్ లైక్ నెవ్వర్ బిఫోర్' అనే క్యాప్షన్​ను కూడా జోడించారు.

ఈ వీడియోలో పంచెకట్టు, చొక్కాతో వెనక్కు తిరిగి ఉన్న నాని ఫోజ్ ఆకట్టుకుంది. అలానే టైటిల్ వెనక వైపు కనిపించిన లేడీస్ సైకిల్, వీణ, పచ్చళ్ల జాడీలు, జాతక చక్రం, షూస్ ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ సినిమాతో నజ్రియా నజీమ్.. తెలుగు తెరకు పరిచయం కానుంది. వివేక్ సాగర్ సంగీతమందిస్తుండగా, వివేక్​ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభమై, వచ్చే ఏడాది థియేటర్లలోనే విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Nov 21, 2020, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.