నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'వి'. నివేదా థామస్, అదితిరావు హైదరీ కథానాయికలు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 5న అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్, నాని నటన సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రను ఎంచుకోవడం వెనుక కారణాన్ని నాని చెప్పుకొచ్చాడు.
"ఏ నటుడైనా తన అభిమానుల నుంచి ప్రేమ, ప్రశంసలు కోరుకుంటాడు. 'వి' మూవీ నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇది నా 25వ చిత్రం. ఏదైనా సరికొత్త రీతిలో ప్రయాణించడం ద్వారా నా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇద్దామని దీన్ని చేశా. నిజంగా ఇది మిమ్మల్ని అలరిస్తుంది. ట్రైలర్‌ను యాక్షన్ ప్యాక్డ్గా తీర్చిదిద్దాం. సినిమా మిమ్మల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. మునివేళ్లపై కూర్చోబెడుతుంది."
-నాని, సినీ నటుడు
ఒక సైకో కిల్లర్ నుంచి పోలీసులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. వాళ్లు దాన్ని ఎలా పరిష్కరించారు? అసలు ఆ హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరో కథానాయకుడు సుధీర్‌బాబు మాట్లాడుతూ.. "ట్రైలర్ విడుదల సందర్భంగా అభిమానులు చేసిన హంగామా చూస్తుంటే నాకు చాలా సంతోషమనిపించింది. వాళ్లే నా బలం. ఇన్ని రోజులు సినిమా కోసం వేచి చూసిన వారికి మంచి యాక్షన్ డ్రామాగా 'వి' అలరిస్తుంది" అని తెలిపాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">